రష్మిక వ్యాఖ్యలతో 'డియర్‌ కామ్రేడ్‌'కు నెగటివ్‌ టాక్‌  

Rashmika Mandana Coments On Dear Comrade Movie-

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ నెల చివర్లో విడుదల కాబోతుంది.తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది.ఆ కార్యక్రమంలో హీరోయిన్‌ రష్మిక మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.దర్శకుడు క్లారిటీ లేకుండా ఈచిత్రాన్ని తెరకెక్కించాడా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.కేవలం అయిదు నిమిషాల సీన్‌ను 20 రోజుల పాటు చిత్రీకరించాడు అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శణం.

Rashmika Mandana Coments On Dear Comrade Movie--Rashmika Mandana Coments On Dear Comrade Movie-

Rashmika Mandana Coments On Dear Comrade Movie--Rashmika Mandana Coments On Dear Comrade Movie-

రష్మిక మాట్లాడుతూ.దర్శకుడు భరత్‌ కమ్మ ఈ చిత్రం కోసం నన్ను చాలా కష్టపెట్టాడు.కేవలం అయిదు నిమిషాల క్రికెట్‌ సీన్‌ కోసం ఏకంగా నాలుగు నెలల పాటు నాతో క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేయించాడు.

ఇక 20 రోజులకు ఎక్కువగానే ఆ సీన్స్‌ను చిత్రీకరించాడు.అంత సమయం ఎందుకు తీసుకున్నాడో అంటూ కామెంట్‌ చేసింది.ఇక డబ్బింగ్‌ విషయంలో కూడా అలాగే జరిగిందట.ఏకంగా నాలుగు నెలల పాటు డబ్బింగ్‌ చెప్పించాడని అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్‌ చేసింది.అలాగే సినిమా త్వరలో విడుదల ఉండగా మొన్న పిలిచి మళ్లీ డబ్బింగ్‌ చెప్పించాడు.

ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌ కూడా తన పాత్రకు ఇంత సమయం డబ్బింగ్‌ చెప్పుకుని ఉండదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.ఆమె సరదాగా అన్నా అంటూ చెప్పినా కూడా ఆమె వ్యాఖ్యలు సినిమాకు డ్యామేజ్‌ అవుతున్నాయి.దర్శకుడు భరత్‌ కమ్మ క్లారిటీ లేకుండా ఇంతగా చేశాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హీరోయిన్‌ పాత్ర విషయంలోనే ఇంత కన్వ్యూజ్‌ అయితే హీరో విషయంలో మరెంత కన్ఫ్యూజ్‌ అయ్యి ఉంటాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ మాత్రం పర్ఫెక్ట్‌నెస్‌ కోసం అలా చేసి ఉంటాడని సమర్ధిస్తున్నారు.

ఈనెల చివర్లో రాబోతున్న సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.