‘గీతా గోవిందం’లు అక్కడకు వెళుతున్నారట... మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యేనా?     2019-01-06   09:01:55  IST  Ramesh Palla

విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోల రేంజ్‌లో అభిమానులను సొంతం చేసుకున్నాడు దేవరకొండ. అందుకు కారణం ‘గీతా గోవిందం’ అని కూడా చెప్పవచ్చు. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఒక వర్గం అభిమానులని ఏర్పరుచుకున్న విజయ్‌ ‘గీతా గోవిందం’ చిత్రంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని అభిమానాన్ని చూరగొన్నాడు.

Geetha Govindam Movie Remaking In Bollywood-Geetha Geetha Rashmika Mandana Vijay Devarakonda

Geetha Govindam Movie Remaking In Bollywood

చిన్న చిత్రంగా విడుదలయి సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలని బాలీవుడ్‌ వర్గాల వారు చర్చలు జరుపుతున్నారు. విజయ్‌ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం ‘కబీర్‌ సింగ్‌’గా హిందీలో ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్‌లో మంచి స్పందన వస్తుండడంతో ‘గీతా గోవిందం’ను కూడా తెరకెక్కించడానికి పలువురు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌లు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Geetha Govindam Movie Remaking In Bollywood-Geetha Geetha Rashmika Mandana Vijay Devarakonda

ఫ్యామిలి అండ్‌ రొమాంటిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిన ‘గీతా గోవందం’కు ఇక్కడ ఊహించని స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రం పట్ల బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. దాంతో ఇక్కడ సూపర్‌హిట్‌ అయ్యింది. అక్కడ కూడా మాంచి రొమాంటిక్‌ హీరో అయితే కచ్చితంగా హిట్‌ అవుతుంది. మన ‘గీతా గోవిందం’లు అక్కడకు వెళితే మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందో చూద్దాం.