ఎట్టకేలకు 'గీత గోవిందం' ఫిక్స్‌  

Geetha Govindam Movie Is Ready To Remake In Hindi-geetha Govindam Movie,geetha Govindam Movie Remake,rohith Shetti,tollywood Box Office

విజయ్‌ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొందిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.వారిద్దరికి కూడా భారీ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది.గత ఏడాది టాప్‌ చిత్రాల జాబితాలో గీత గోవిందం కూడా నిలిచింది.అంతటి సెన్షేషనల్‌ మూవీని హిందీలో రీమేక్‌ చేయాలని అనుకున్నారు.అయితే అక్కడ మేకర్స్‌ ఎవరు కూడా ఆసక్తి చూపక పోవడంతో ఆ ఆలోచనను వదిలేశారు.సంవత్సరం తర్వాత మళ్లీ ఇప్పుడు గీత గోవిందం రీమేక్‌ గురించి వార్తలు మొదలయ్యాయి.

Geetha Govindam Movie Is Ready To Remake In Hindi-geetha Govindam Movie,geetha Govindam Movie Remake,rohith Shetti,tollywood Box Office-Geetha Govindam Movie Is Ready To Remake In Hindi-Geetha Geetha Rohith Shetti Tollywood Box Office

బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ దర్శక నిర్మాత రోహిత్‌ శెట్టి తీసుకున్నాడట.ఈయన తెలుగు టెంపర్‌ చిత్రంను హిందీలో సింబాగా రీమేక్‌ చేసి సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు.

Geetha Govindam Movie Is Ready To Remake In Hindi-geetha Govindam Movie,geetha Govindam Movie Remake,rohith Shetti,tollywood Box Office-Geetha Govindam Movie Is Ready To Remake In Hindi-Geetha Geetha Rohith Shetti Tollywood Box Office

ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మరో తెలుగు సినిమాను రీమేక్‌ చేయాలని ఈయన ఉబలాట పడుతున్నాడు.కొత్త వారితో గీత గోవిందం రీమేక్‌ చేసే విషయమై చర్చలు జరుపుతున్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా ఒక జాతీయ మీడియా సంస్థ కథనం రాసింది.

గీతా ఆర్ట్స్‌ సంస్థతో గీత గోవిందం చిత్రం రీమేక్‌ రైట్స్‌ విషయమై రోహిత్‌ శెట్టి ఒప్పందం చేసుకున్నారు.మొదట గీతా ఆర్ట్స్‌ సంస్థ బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని భావించింది.ఆ తర్వాత ఎవరి భాగస్వామ్యంలో అయినా రీమేక్‌ చేయాలనుకుంది.కాని ఇప్పుడు పూర్తిగా రోహిత్‌ శెట్టికి వదిలేసినట్లుగా సమాచారం అందుతోంది.అల్లు అరవింద్‌ ఈ రీమేక్‌ రైట్స్‌ ద్వారా భారీ మొత్తంను దక్కించుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదిలోనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి అక్కడ కబీర్‌ సింగ్‌గా సెన్షేషనల్‌ హిట్‌ అయ్యింది.అందుకే ఈ చిత్రం కూడా అక్కడ ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది.