‘గీత గోవిందం’ మొదటి రోజు కలెక్షన్స్‌  

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. పరుశురామ్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. నిన్న పబ్లిక్‌ హాలీడే అవ్వడంతో పాటు, ఎక్కువ థియేటర్లలో విడుదల కావడం మరియు ఇతర సినిమాల నుండి పోటీ లేకపోవడంతో మొదటి రోజున భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల్లో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక స్టార్‌ హీరో సినిమా స్థాయిలో ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి వసూళ్లు నమోదు అయినట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. స్టార్‌ హీరోలకు మాత్రమే మొదటి రోజు 10 కోట్లు ఆపై షేరు సాధ్యం అవుతుంది. కాని విజయ్‌ దేవరకొండ ఆ ఫీట్‌ను సాధించాడు. 9.66 కోట్ల షేర్‌ను మొదటి రోజు దక్కించుకుని రికార్డు సృష్టించాడు.

Geetha Govindam Movie First Day Collections-

Geetha Govindam Movie First Day Collections

విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో ఆడియన్స్‌లో మరింత అభిమానంను దక్కించుకున్నాడు. ఆంధ్రా మరియు తెలంగాణలో కలిపి ఈ చిత్రం 5.8 కోట్లు షేర్‌ను రాబట్టగా, ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ షోలు మరియు సాదారణ షోలు, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు కలుపుకుంటే మొత్తంగా 9.66 కోట్లుగా సమాచారం అందుతుంది. ఇంత భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రావడంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

సినిమాపై భారీ అంచనాలుండటంతో పాటు, ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం వల్లే ఈ కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి అంటూ ట్రేడ్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 40 నుండి 45 కోట్ల వరకు రాబట్టే అవకాశం లేకపోలేదు అంటూ సమాచారం అందుతుంది.