గోవిందం దర్శకుడి వెంట పడుతున్నారు  

సినిమా ఇండస్ట్రీకి బెల్లం చుట్టు ఈగలు అనే సామెత బాగా సూట్‌ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సక్సెస్‌ ఉన్నంత సమయం చుట్టు జనాలు చాలా మంది ఉన్నారు. అదే ఒకటి రెండు ఫ్లాప్‌లు పడితే చుట్టు ఉన్న జనాలు మెల్లగా జారుకుంటారు. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్‌ పరిస్థితి అలాగే ఉంది. ‘గీత గోవిందం’ చిత్రంతో దర్శకుడిగా సక్సెస్‌ అయిన పరశురామ్‌తో పలువురు హీరోలు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గీత గోవిందంకు ముందు పలువురు హీరోలకు ఈయన కథలు వినిపించడం జరిగింది. అప్పుడు నో చెప్పిన వారు ఇప్పుడు ముందుకు వస్తున్నారు.

Geetha Govindam Director Gets Huge Offers From Tollywood-

Geetha Govindam Director Gets Huge Offers From Tollywood

గీత గోవిందం చిత్రానికి ముందు మంచు హీరో విష్ణుతో ఒక చిత్రాన్ని పరశురామ్‌ చేయల్సి ఉంది. కాని పరశురామ్‌ రెడీ చేసిన స్క్రిప్ట్‌పై అనుమానాలు పెట్టుకున్న మంచు ఫ్యామిలీ ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసుకుంది. ఇప్పుడు గీత గోవిందం హిట్‌ టాక్‌ను దక్కించుకున్న వెంటనే పరశురామ్‌తో ఆ సినిమాను మొదలు పెట్టాలని విష్ణు భావిస్తున్నాడు. అదే విషయాన్ని మీడియాకు లీక్‌ చేశాడు. మీడియాలో పరశురామ్‌ తర్వాత సినిమా విష్ణుతో అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే గీతాఆర్ట్స్‌ పీఆర్‌ఓ పరుశురామ్‌ తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు.

‘శ్రీరస్తు సుభమస్తు’, ‘ గీత గోవిందం’ చిత్రాలతో గీతా ఆర్ట్స్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లను దక్కించుకున్న పరుశురామ్‌ తదుపరి చిత్రాన్ని కూడా గీతాఆర్ట్స్‌లోనే చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఇలా వరుసగా మూడు సినిమాలు గీతాఆర్ట్స్‌లో చేస్తున్న మొదటి దర్శకుడిగా పరుశురామ్‌ రికార్డు సృష్టించబోతున్నాడు. మెగా హీరోతో పరుశురామ్‌ తదుపరి చిత్రం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఏ హీరోతో ఈయన మూవీ ఉండబోతుందనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఖచ్చితంగా మాత్రం మెగా మూవీ అయ్యి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

Geetha Govindam Director Gets Huge Offers From Tollywood-

ప్రస్తుతం గీత గోవిందం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయడంతో పాటు, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పరుశురామ్‌ త్వరలోనే తదుపరి చిత్రానికి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాదిలో పరుశురామ్‌ తదుపరి చిత్రం రాబోతుంది. ఈయన దర్శకత్వంలో ఆ తర్వాత అయినా నటించాలని పలువురు హీరోలు కాల్స్‌ చేస్తున్నారట. అయితే పరుశురామ్‌ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోంది.