90 ఎంఎల్ హీరోను బుక్ చేసిన గీతా

ఆర్‌ఎక్స్100 సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ.ఆ తరువాత మనోడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

 Geetha Arts Lock Karthikeya For New Movie-TeluguStop.com

తాజాగా 90ఎంఎల్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో నటించిన కార్తికేయ నేడు తన సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశాడు.ఈ సినిమాకు వివిధ చోట్ల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉండగా తన నెక్ట్స్ మూవీని కూడా అప్పుడే లైన్‌లో పెట్టేశాడు 90 ఎంఎల్ హీరో.ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు కార్తికేయ డీల్ కుదుర్చుకున్నాడు.

యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కబోయే ఈ సినిమాను కౌశిక్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కథ చాలా బాగుందని గీతా ఆర్ట్స్‌తో పాటు కార్తికేయ కూడా వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.

కాగా కార్తికేయ సినిమా సినిమాకు డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన 90ఎంఎల్ సినిమా ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ఈ వారాంతం ఆగితే తెలుస్తోంది.

అటు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోని తన సినిమా గురించి అతి త్వరలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు ఈ హీరో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube