నేను ఒక గేను.. ఆ విషయాన్ని ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటా..!

నేను ఒక గే (Gay)ను.నేను ఇక క్రిమినల్‌ను ఎంత మాత్రం కాదు.

 Gay Feeling About Section 377 Suprme Court-TeluguStop.com

ఆర్టికల్ 377 పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం.ఆ రోజునే నా జీవితం పూర్తిగా మారిపోయింది.

పట్టుపురుగు గూడు నుంచి సీతాకోకచిలుక బయటకు వచ్చినట్లు నాకు అనిపించింది.నేను నపుంసకున్నని, నాకు అంగ స్తంభన సమస్యలు ఉన్నాయని మొదట్లో మా తల్లిదండ్రులు అనుకునేవారు.

కానీ ఆర్టికల్ 377పై తీర్పు వచ్చాక వారు నాకు కంగ్రాట్స్ చెప్పారు.నా విషయం పట్ల వారికి అప్పుడు ఆనంద భాష్పాలు వచ్చాయి.

ఇక నా గురించి ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని నా తల్లిదండ్రులు ఆ రోజే భావించారు.

నా గురించి, నా స్వభావం, ప్రవర్తన గురించి నా తల్లిదండ్రులకు, కొద్దిమంది దగ్గరివారు, స్నేహితులకే తెలుసు.ఎందుకంటే గే అని చెబితే చుట్టూ ఉన్న సమాజం నన్ను ఎలా చూస్తుందో నాకు తెలుసు.నాన్న ప్రభుత్వ ఉద్యోగి.

దీంతో ఆయన పేరుకు మచ్చ వస్తుందని మొదట్లో నేను భయపడ్డా.కానీ నాకు ఇప్పుడా భయం లేదు.

నా ఉనికిని, వ్యక్తిత్వాన్ని నేను చాటుకోవచ్చు.సమాజంలో తల ఎత్తుకుని గర్వంగా జీవించవచ్చు.

నేను గే అని చెప్పుకునేందుకు ఇప్పుడు నాకు ఎలాంటి అభ్యంతరం, భయం లేదు.అదే విషయాన్ని నా తల్లిదండ్రులు కూడా గర్వంగా ఇతరులకు చెబుతున్నారు.

నేను గే అని తెలిసినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అందించిన సపోర్ట్‌ను నేను మరువలేను.కానీ ఇప్పుడు నాకు నిజంగా మంచి రోజులు వచ్చాయి.నా విషయంలో నా తల్లిదండ్రులకు ఇప్పుడు ఎలాంటి బెంగ లేదు.నా గురించి అందరికీ తెలిసింది కదా.కనుక నాకు పెళ్లి చేసే విషయంలో అమ్మాయిలను వెదకడంపై ఇకపై ఎవరికీ బెంగ ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube