'ఎవరికి కావలి ఈ ముష్టి...మా ఆటగాళ్లను అవమానిస్తారా..?'ఆసీస్ పై మండిపడుతున్న గవాస్కర్..! నెటిజెన్స్ కామెంట్స్ ఇవే.!

ఆస్ట్రేలియా గడ్డపై టీం ఇండియా చరిత్ర సృష్టించింది.దాదాపు 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల కలని కోహ్లీసేన సాకారం చేసింది.ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకొని.టీ-20 సిరీస్‌ని టై చేసుకొని చరిత్ర సృష్టించింది.ఈ సందర్భంగా కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 Gavaskar Fires On Australia For The Gift Of Mahendra Singh Dhoni-TeluguStop.com

ర్యటనకు వెళ్లిన భారత్ 1-4తో ఓటమి పాలైంది.రెండేళ్ల తర్వాత ఇప్పుడు కోహ్లీ ప్రతీకారం తీర్చుకున్నాడు.కాగా, 1947-48లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 0-4తో ఘోర ఓటమి చవి చూసింది.

నాటి నుంచి ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షలా మారిన సిరీస్ విజయాన్ని భారత్‌కు అందించిన కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.

ఇది ఇలా ఉండగా.

ఆస్ట్రేలియా(సీఏ)పై టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఫైర్ అవుతున్నారు.తమ ఆటగాళ్లకు ముష్టి వేసినట్లు 500 యూఎస్‌ డాలర్ల(రూ.35వేలు) బహుమతిగా ఇచ్చి అవమానిస్తారా? అని నిలదీశారు.మూడు వన్డేల సిరీస్‌ గెలిస్తే ముష్టేసినట్లు ఓ ట్రోఫీతో సరిపెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.గవాస్కర్‌ సోనీ సిక్స్‌తో మాట్లాడుతూ.సీఏ, టోర్నీ నిర్వాహకులను తప్పుబట్టారు.

‘మరి కనికరం లేకుండా.ఏందీ ఈ 500 యూఎస్‌ డాలర్లు.సిరీస్‌ గెలిస్తే భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే దక్కింది.టోర్నీ నిర్వాహకులు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేకపోయారు.బ్రాడ్‌కాస్ట్‌ హక్కుల పేరిట చాలా సొమ్ముచేసుకున్నారు.అయినా ఆటగాళ్లకు మంచి నగదు బహుమతి ఎందుకు ఇవ్వలేదు? ఆటగాళ్ల వల్లనే స్పాన్సర్‌ వస్తారు.వారి వల్లనే డబ్బులు వస్తాయి.ఒక్కసారి వింబుల్డన్‌లో ఆటగాళ్లకు ఇచ్చే నగదు బహుమతిని చూడండి.ఆటగాళ్ల వల్లనే క్రీడల్లో డబ్బులు వర్షం కురుస్తోంది.వారికి గౌరవప్రదమైన క్యాష్‌ రివార్డ్స్‌ ఇవ్వండి’ అని గవాస్కర్‌ చురకలంటించాడు.

ఇక భారత అభిమానులు సైతం గవాస్కర్‌ మాటలకి సపోర్ట్ చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా “ఎవడికి కావాలి ఈ ముష్టి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube