ఈయనేం డీజీపీ అండి బాబు.. ఇంత షాక్‌ ఇచ్చారు?  

gautham savang comments on chandrababu naidu - Telugu Chandrababu Amaravathi Tour, Gautham Savang,, Gautham Sawang Ap Dgp, One Of The Farmmar Throw The Slipper To Chandrababu Naidu

ఆయన ఓ రాష్ట్రానికి డీజీపీ.రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడటం ఆయన బాధ్యత.

TeluguStop.com - Gautham Savang Comments On Chandrababu Naidu

<a href=https://telugustop.com/gautham-savang-comments-on-chandrababu-naidu-%e0%b0%a1%e0%b1%80%e0%b0%9c%e0%b1%80%e0%b0%aa%e0%b1%80/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

కానీ ఏకంగా ప్రతిపక్ష నేత ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనపై ఆయన స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది.అమరావతిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మరీ ఓ అధికార పార్టీ నేతలాగా మాట్లాడారు.

చంద్రబాబుకు అనుమతి ఇచ్చాం కాబట్టి ఇలా జరిగింది.ఒకవేళ ఇచ్చి ఉండకపోతే ఇంకా పెద్దగానే జరిగేదని సవాంగ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.అయినా ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, చంద్రబాబుపైకి చెప్పు విసిరింది ఓ రైతు అని ఆయన అన్నారు.సవాంగ్‌ అక్కడితో ఆగలేదు.ఒకవైపే కాదు.రెండో వైపు కూడా చూడాలంటూ మీడియాకే హితబోధ చేయడం విశేషం.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

రాళ్లు, చెప్పులు వేసిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకున్నాం.అయితే ఇలా దాడి చేయడానికి కారణాన్ని వాళ్లు వివరించారు.అందులో ఒకరు రైతు, మరొకరు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసిన వ్యాపారవేత్త ఉన్నారు.చంద్రబాబు వల్ల నష్టపోయాం కాబట్టే ఇలా చేశామని చెప్పారు.ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు.

.TeluguStop

సాధారణంగా డీజీపీ స్థాయి అధికారులు ఇలా ఓ పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లుగా మాట్లాడరు.

జరిగిన సంఘటనను వివరించి, తమ శాఖ చేపట్టిన చర్యలను చెబుతుంటారు.కానీ గౌతమ్‌ సవాంగ్‌ మాత్రం ఒకరకంగా దాడిని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది.

#GauthamSavang #Gautham Savang #GauthamSawang #OneOf

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gautham Savang Comments On Chandrababu Naidu Related Telugu News,Photos/Pics,Images..