రామ్ చరణ్ తో సినిమా అంతా పుకారే అంటున్న జెర్సీ దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్యలో కూడా ప్రస్తుతం నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయి.

 Gautam Tinnanuri Clarifies Rumors About Film With Ram Charan-TeluguStop.com

వీటి తర్వాత సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ చిత్రాన్ని చరణ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే గౌతమ్ రామ్ చరణ్ కి కథ కూడా వినిపించాడని, దానికి చరణ్ ఇంప్రెస్ అయ్యి వెంటనే ఒకే చెప్పెసాడని టాక్ నడిచింది.అయితే ఆర్ఆర్ఆర్ తర్వాతనే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని ప్రచారం జరిగింది.

 Gautam Tinnanuri Clarifies Rumors About Film With Ram Charan-రామ్ చరణ్ తో సినిమా అంతా పుకారే అంటున్న జెర్సీ దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఇంతలో శంకర్ దర్శకత్వంలో సినిమాని రామ్ చరణ్ ఎనౌన్స్ చేసేశాడు.అయితే గౌతమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా పక్కా అని మాత్రం బలంగా టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ సినిమా విషయంపై క్లారిటీ ఇచ్చాడు. హిందీ జెర్సీ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నానని తెలిపాడు.

ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు.ప్రస్తుతం తాను కొత్త కథలు సిద్ధం చేసుకుంటున్నానని, కథను బట్టి హీరోలను కలుస్తానని అన్నాడు.

ఇంతవరకూ ఏ హీరోను కలవలేదనీ, ఎవరికీ కథ చెప్పలేదనే విషయాన్ని స్పష్టం చేశాడు.దీనిని బట్టి గౌతమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనేది కేవలం గాసిప్ మాత్రమే అని క్లారిటీ వచ్చేసింది.

#Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు