ప్రేక్షకులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి సినిమాలలో కోలీవుడ్ నటుడు విజయ్ ( Vijay ) నటించిన లియో సినిమా( Leo Movie )ఒకటి.కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన చిత్రం లియో.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ దసరా పండుగ సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇలా ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ( Gautham vasu dev Menon ) లియో సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అక్టోబర్ 19వ తేదీ విడుదల కాబోతున్నటువంటి సినిమా మైండ్ బ్లోయింగ్ ఫిలిం అంటూ కితాబు ఇచ్చారు.డబ్బింగ్ సమయంలో నా సీన్స్ కొన్ని చూసాను సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ఈయన వెల్లడించారు.
సినిమా చాలా సూపర్ గా వచ్చిందని విజయ వంటి గొప్ప హీరోతో నటించడం నిజంగా అదృష్టం అంటూ ఈయన వెల్లడించారు.

సినిమా షూటింగ్ లొకేషన్లో విజయ్( Hero Vijay ) ను తాను గమనిస్తూనే ఉండేవాడిని షూటింగ్ 9 గంటలకు అంటే లొకేషన్ లోకి ఈయన ఏడు గంటలకే వచ్చేవారు లొకేషన్ లోకి వచ్చినప్పటి నుంచి స్క్రిప్ట్ పేపర్ తీసుకొని డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారని ఆయన సినిమా పట్ల ఎంతో అంకితభావంతో పనిచేస్తారని ఈ సందర్భంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ విజయ్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇలా ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ( Leo First Review ) రావడమే చాలా పాజిటివ్గా రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా డైరెక్టర్ రివ్యూతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు కూడా పెరిగిపోయాయి.
లియో సినిమా ద్వారా లోకేష్ మరోసారి తన మార్క్ చూపిస్తారా లేదా అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాలి.