ప్రేమకు వయసుతో సంబంధం లేదని కొందరు అప్పుడప్పుడు కవితల రూపంలో చెబుతుంటారు.దీంతో ఈ మధ్యకాలంలో కొందరు తమ కంటే చిన్నవాళ్లని లేదా తమ కంటే పెద్ద వాళ్ళని ప్రేమిస్తూ పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు.
కాగా తాజాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో “నా పేరే కాంచనమాల” పాటలలో ఆడి పాడి అలరించిన బాలీవుడ్ బ్యూటీ గౌహర్ ఖాన్ ఇటీవలే తన పెళ్లి ప్రకటన చేసింది.ఇందులో బాలీవుడ్ లో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జైద్ దర్భార్ ని పెళ్ళాడబోతోంది.
దీంతో ఈ విషయంపై ఇటీవలే గౌహర్ ఖాన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన కూడా చేసింది. దీంతో కొందరు నెటిజన్లు గౌహర్ ఖాన్ ని మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి మీకు మధ్య దాదాపుగా 12 సంవత్సరాలు వయసు భేదం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీంతో గౌహర్ ఖాన్ తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ ఒక వ్యక్తిని ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదని, అంతేగాక ఇద్దరూ ఒకరినొకరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చామని తెలిపింది.పెళ్లంటే ఇద్దరి మనుషుల కలయిక కాదని ఇద్దరి మనసుల కలయికని అలాగే జైద్ దర్బార్ తనని బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉందని కూడా తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం గౌహర్ ఖాన్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తూనే మరో పక్క సీరియళ్లలో కూడా నటిస్తోంది. అలాగే జైద్ దర్బార్ కూడా పలు బాలీవుడ్ చిత్రాల్లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.కాగా వీరిద్దరి వివాహం ఈనెల 25 వ తారీఖున జరగనుంది.కాగా ఇటీవలే హిందీలో మొదలైన బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో 4వ సీజన్లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.