టీడీపీలోకి హీరో మహేష్ చిన్నాన్న...?

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు.మహేష్ చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

 Gattamaneni Adiseshagirirao Join In Tdp-TeluguStop.com

ఇటీవలే వైసీపీకి రాజీనామ చేసిన ఆయన ఫిబ్రవరి 7, 8 తేదీల్లో టీడీపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.సినీ నటుడు కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరి రావు చర్చించిన తర్వాత ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

వాస్తవంగా… శేషగిరిరావు వైసీపీలో మొదటినుంచి కీలకంగా వ్యవహరించారు.ఆయనకు జగన్ కూడా బాగానే ప్రాధాన్యం ఇచ్చాడు.అయితే… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిశేషగిరి రావు వైసీపీ అభ్యర్థిగా తెనాలి నుంచి బరిలో దిగాలని భావించారు.అయితే విజయవాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని జగన్‌ సూచించినట్లు సమాచారం.అయితే ఇది ఇష్టంలేకపోవడం… తెనాలి అసెంబ్లీ సీటు దక్కే అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube