కొత్త ఆవిష్కరణ : ఇకపై డ్రస్‌ల ఇస్త్రీకి బొగ్గులు అక్కర్లేదు, గ్యాస్‌తో పనిచేసే ఐరెన్‌ బాక్స్‌

మనదేశంలో డ్రస్‌ల ఐరెన్‌కు బొగ్గుల ఇస్త్రీ పెట్టె వాడుతున్నారు.ప్రతి రోజు క్వింటాల్లకు క్వింటాల్లు బొగ్గులు వాడుతున్నారు.

 Gas Heating System For Gas Clothing Iron Box Knob Regulator-TeluguStop.com

ఆ బొగ్గు కోసం ప్రతి రోజు పెద్ద ఎత్తున చెట్టను నరికివేయాల్సి వస్తుంది.చెట్లను నరకడం వల్ల అనేక పర్యావరణ సమస్యలు వస్తాయనే విషయంత ఎల్సిందే.

అందుకే చెట్లను నరక్కుండా ఏదైనా పరిష్కారం చూడాలనుకున్నారు.కరెంట్‌తో నడిచే ఇస్త్రీ పెట్టె ఉంది.

కాని అది ఇంట్లో వాడుకునే వరకు అయితే పర్వాలేదు కాని షాప్‌ కోసం అయితే చాలా ఎక్కువగా కరెంట్‌ వాడుతుంది.

కరెంటు బిల్లుకు భయపడి ఎవరు కూడా అది వాడటం లేదు.

బొగ్గులు, కరెంట్‌ కాకుండా విభిన్నంగా గ్యాస్‌తో నడిచే ఐరెన్‌ బాక్స్‌ను ఆవిష్కరించడం జరిగింది.ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ ఈ గ్యాస్‌ ఐరెన్‌ బాక్స్‌లను అమ్ముతోంది.

దీని ఖరీదు 8 వేల రూపాయలు.ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఐరెన్‌ బాక్స్‌ లభిస్తూనే ఉంది.

గ్యాస్‌తో నడిచే ఐరెన్‌ బాక్స్‌ వల్ల చాలా లాభాలు ఉన్నాయి.తక్కువ ఇందనంతో ఎక్కువ పని అవ్వడంతో పాటు, ఎక్కువ టైం వృదా అవ్వదు.

కరెంట్‌ ఐరెన్‌ బాక్స్‌తో పోల్చితే గ్యాస్‌ ఐరెన్‌ బాక్స్‌ అన్ని విధాలుగా బెటర్‌ అంటూ వాడుతున్న వారు అంటున్నారు.ఉదాహరణకు 100 జతల డ్రస్‌లు ఐరెన్‌ చేయాలంటే 250 రూపాయల కరెంట్‌ వినియోగం అయితే గ్యాస్‌ అందులో సగం అంటే కేవలం 125 రూపాయలు మాత్రమే వినియోగం అవుతుందని అంటున్నారు.

అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.గ్యాస్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ ఆఫ్‌ సిస్టం ఇందులో ఉన్న కారణంగా ఓవర్‌ హీట్‌ అయ్యే అవకాశం ఉండదు.

Telugu Iron Box, Cylinder Iron, Gas System, Knob, Lpg Cylinder-

 

బొగ్గుల కోసం కట్టెలు కొట్టడం, కరెంట్‌ను వాడటం వల్ల ఎక్కువ కరెంట్‌ బిల్లు రావడం వంటి సమస్యల నుండి ఇది బయట పడేస్తుంది.ఇకపై ప్రతి ఇస్త్రీ షాప్‌లలో ఈ గ్యాస్‌ ఐరెన్‌ బాక్స్‌లు ఉండే అవకాశం ఉంది.ప్రస్తుతం 8 వేలు ఉన్న ఈ బాక్స్‌ అతి త్వరలో రేటు సగానికి తగ్గే అవకాశం ఉంది.మార్కెట్‌లోకి వేరే కంపెనీలకు చెందిన గ్యాస్‌ ఐరెన్‌ బాక్స్‌లు వస్తే రేటు తగ్గనుంది.

మొత్తానికి ఈ ఆవిష్కరణ వల్ల పలు విధాలుగా లాభం ఉందని ఇస్త్రీ షాప్‌లు నిర్వహించే వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube