బ్యాడ్ న్యూస్ : గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు బంద్ !  

gas, gas subsity money, bad news for gas customers - Telugu Bad News For Gas Customers, Gas, Gas Subsity Money

మీరు ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా బుక్ చేసుకున్నారా.బుక్ చేసుకున్న తర్వాత ఒక వారం రోజుల్లో సబ్సిడీ డబ్బులు మీ ఖాతాల్లో పడేవి కదా.

 Gas Gas Subsity Money

అలా డబ్బులు పడ్డాయో లేదో అని బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి.కానీ అవి మీ అకౌంట్లో జమ అయి ఉండవు.గత మూడు నెలలుగా కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమవ్వడం లేదు.2020 మే నెల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వారికి సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో పడటం లేదు.మే నెల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ డబ్బులను నిలిపివేసింది.మాములుగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఏడాదిలో ఒక్కో కుటుంబానికి నెలకి ఒకటి చొప్పున మొత్తం 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈ అవకాశం ఒక్క 14.2 కేజీల సిలిండర్లు వినియోగించేవారికే ఇది వర్తిస్తుంది.అయితే సంవత్సరంలో ఈ 12 గ్యాస్ సిలిండర్ల లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ డబ్బులు బ్యాంకు లో పడవు.సిలిండర్ రేటు మార్కెట్ ధరలో ఎంత ఉంటే అంతా చెల్లించాలిసిందే.!! అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.అయితే ఇప్పుడు గత 3 నెలలుగా సబ్సిడీ డబ్బులు కూడా బ్యాంకు లో పడడం లేదు.

బ్యాడ్ న్యూస్ : గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు బంద్ -General-Telugu-Telugu Tollywood Photo Image

దీనికి కారణం గత సంవత్సర కాలంలో సబ్సిడీ లేనటువంటి గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతూ వచ్చింది.అదే సమయంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల రేటు పెరుగుతూ వచ్చింది.

దీంతో ఇప్పుడు సబ్సిడీ సిలిండర్, సబ్సిడీ లేనటువంటి సిలిండర్ ధరలు దాదాపు లెవల్ అయ్యాయి.అందుకే మోదీ సర్కార్ సబ్సిడీని బంద్ చేసింది అని అర్ధం అవుతుంది.!

.

#Gas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gas Gas Subsity Money Related Telugu News,Photos/Pics,Images..