సామాన్యుడికి మ‌రోసారి షాక్‌ ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ?

సమాజంలో బాగా డబ్బున్న వాడు బ్రకవచ్చూ, లేదా పూర్తిగా బాధ్యతలు లేకుండా ఏకాకిగా ఉన్న బికారి ఆనందంగా బ్రతకవచ్చూ.కానీ మధ్య తరగతి మనిషి మాత్రం కన్నీళ్లతో కడుపు నింపుకునే పరిస్దితులు తలెత్తుతున్నాయి.

 Gas Cylinder Prices Shocking The Common Man-TeluguStop.com

ఇది ప్రజల తప్పా? పాలకుల తప్పా? వీరి విజ్ఞతకే వదిలేస్తే.గత సంవత్సరం నుండి మధ్యతరగతి బ్రతుకులు మాత్రం పెంక మీది పేలాలుగా మారుతున్నాయన్నది సృష్టంగా అర్ధం అవుతుంది.

ఎందుకంటే సగటు జీవి బ్రతకలేనంతగా పెరుగుతున్న ధరలే కారణమట.

 Gas Cylinder Prices Shocking The Common Man-సామాన్యుడికి మ‌రోసారి షాక్‌ ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదల ప్రజల జీవితాలను శాసిస్తుండగా, నిత్యావసరాల ధరలన్ని కొండెక్కి కూర్చున్నాయి.

ఈ క్రమంలో సామాన్యుడికి వంట గ్యాస్ ధ‌ర‌ల పెంపు రూపంలో మ‌రో షాక్ త‌గిలింది.కాగా తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా పెరిగాయి.ఇకపోతే ఈ మూడు నెలల వ్యవధిలో వంట గ్యాస్‌ బండపై రూ.225 పెరిగింది.ఈ రోజు మ‌రో రూ.25 పెంపుతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.819 కి చేరింది.

ఇక వాణిజ్య సిలిండర్‌పైనా ఈ రోజు రూ.95 పెరగడంతో, సిలిండర్‌ ధర మొత్తం రూ.1,614కు చేరిందిచూస్తున్నారా సర్కారు సార్లు.ప్రజలకు గుడ్దగోచి కూడా మిగలనిచ్చేలా లేరు.మీరు ఇలాగే ధరలు పెంచుకుంటూ వెళ్లితే మళ్లీ తిరుగుబాటుదారులు పుట్టుకొస్తారని ఆవేశంతో రగిలిపోతున్న కొందరు అనుకుంటున్నారట.

#Prices #Gas Cylinder #Shocking #Common Man #Gas Rates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు