గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గట్టిగా షాక్ ఇచ్చిన కేంద్రం... అసలు మ్యాటర్ ఏంటంటే...?

కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ వినియోగదారులను షాక్ ఇవ్వనుంది.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిపోయాయి.

 The Center That Gave The Gas Cylinder Customers The Hardest Shock Is The Real Ma-TeluguStop.com

అన్ని రంగాలు మూతపడటంతో కేవలం నిత్యావసరాలకే సిలిండర్లను వినియోగించేవారు.దీంతో సిలిండర్లకు డిమాండ్ లేకపోవడంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముడి చమురు ధరలు అమాంతం పడిపోయాయి.

అయితే భారతదేశ ప్రజలకు ముడిచమురు తగ్గినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి కొంచెం ఊరట లభించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ అందించేది.కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా కుదేలైన ప్రభుత్వం సబ్సిడీని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ చెల్లించడం లేదు.మెట్రో నగరాల్లో ఉంటే ప్రజలకు మే నుంచి సిలిండర్ల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వలేదు.

దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల ఉజ్వల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు.కేంద్ర ప్రభుత్వం వీరికి నామమాత్రంగా రూ.20 సబ్సిడీని అందిస్తోంది.ఇతర నగరాల్లో కేవలం రూ.2 నుంచి 5 మాత్రమే చెల్లిస్తోంది.ప్రభుత్వం సబ్సిడీ చెల్లించకపోవడంతో ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ ధర మార్కెట్ ధర ఆధారంగానే కొనుగోలు చేస్తున్నారు.మార్చి నెలలో 2వ వారంలో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి.

బ్యారెల్ ముడి చమురు ధర 35 డాలర్ల నుంచి 20 డాలర్లకు చేరింది.ప్రస్తుతం బ్యారెల్ ధర 25 డాలర్లుగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఢిల్లీలో రాయితీయేతర సిలిండర్ ధర మే నెలలో రూ.581 గా ఉండేది.ప్రభుత్వం అందించే సబ్సిడీ కూడా అంతే ఉండటంలో వినియోగదారులు డబ్బులు చెల్లించని పరిస్థితి.గత ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ వినియోగదారుల సబ్సిడీ కోసం రూ.34,058 కోట్లు కేటాయించగా.ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.37,256.21 కోట్లు కేటాయించింది.సబ్సిడీ డబ్బులు కేటాయించకపోవడంతో డబ్బులు మిగులుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.పరిస్థితులు ఇలానే కొనసాగితే భవిష్యత్ లో సబ్సిడీ ఎత్తేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube