ప్రతిరోజు ఉదయం వెల్లుల్లి టీ తాగడం వళ్ళ ఏం జరుగుతుందో తెలుసా

మనం ప్రతి రోజు వంటల్లో ఉపయోగించే వెల్లుల్లిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలిసిన విషయమే.వెల్లుల్లిని వంటల్లో వేయటం వలన వంటకు మంచి రుచి,వాసన వస్తాయి.

 Garlic Tea, Health Benefits Of Tea, Health Tips, Telugu Health-TeluguStop.com

వెల్లుల్లిని వంటల్లోనే కాకుండా టీగా కూడా తయారుచేసుకోవచ్చు.ఈ వెల్లుల్లి టీని త్రాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఒక కప్పు నీటిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి.ఆ నీటిని వడకట్టి తేనే లేదా నిమ్మరసం కలిపి త్రాగాలి.ఈ వెల్లుల్లి టీని ప్రతి రోజు పరగడుపున త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


శరీర జీవక్రియ పెరిగి ఆకలి తగ్గి ఆహారం తీసుకోవటం తగ్గుతుంది.దాంతో బరువు తగ్గుతారు.అలాగే శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది.

వెల్లుల్లిలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించే లక్షణాలు ఉండుట వలన రక్తంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోయి రక్త సరఫరా బాగుంటుంది.

అలాగే రక్తనాళాల్లో కొవ్వు కరగటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

ప్రతి రోజు ఒక కప్పు వెల్లుల్లి టీని త్రాగితే దగ్గు, జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు దూరం అవుతాయి.

వెల్లుల్లి టీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube