ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లా.. అయితే వెల్లుల్లితో నివారించుకోండిలా!

ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు ఎంత‌గా వేధిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఎంత తెల్ల‌గా, అందంగా ఉన్నా.

 Garlic Helps To Reduce Dark Spots On Face-TeluguStop.com

న‌ల్ల మ‌చ్చ‌లు ఉంటే మాత్రం అంద‌హీనంగా క‌నిపిస్తారు.ముఖ్యంగా ఉండే వారికి న‌ల్ల మ‌చ్చ‌లు మ‌రింత ఇబ్బంది పెడుతుంది.

దీంతో మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీములు, లోష‌న్లు ఎంతో ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, ఫ‌లితం లేక‌పోతే బ‌లైపోతుంటారు.

 Garlic Helps To Reduce Dark Spots On Face-ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లా.. అయితే వెల్లుల్లితో నివారించుకోండిలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వెల్లుల్లి న‌ల్ల మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి వెల్లుల్లిని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను మొత్త‌గా చేసుకుని.అందులో నుంచి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఆ వెల్లుల్లి ర‌సంలో కొద్ది క‌ల‌బంద గుజ్జు మ‌రియు రెండు చుక్కలు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుప‌కోవాలి.ఆ త‌ర్వాత ఆ మిశ్ర‌మాన్ని న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న చోటు అప్లై చేసి.

పావు గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తూ.న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

రెండొవ‌ది.వెల్లుల్లి రెబ్బ‌ల‌ను పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న‌చోటు రాసి.రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేసి కాసేపు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా న‌ల్ల మ‌చ్చ‌లు మ‌టుమాయం అవుతాయి.

మొటిమ‌లు ఉన్న వారు కూడా ఈ టిప్ ఫాలో అయితే మంచి రిజ‌ల్ట్ ఉంటుంది.

మూడొవ‌ది.ఒక బౌల్ తీసుకుని అందులో వెల్లుల్లి పేస్ట్‌, పెరుగు మ‌రియు కొద్దిగా రోజ‌ల్ వాట‌ర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న చోటు రాసి.

ఇర‌వై నిమిషాలు పాటు ఆరనివ్వాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేస్తుంటే క్ర‌మంగా న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గి.ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

#Dark Spots #Garlic #Beauty Tips #Beauty #Skin Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు