పెండ్లిలో చిచ్చు రేపిన పూల‌మాల‌.. చివ‌ర‌కు ఎంత దారుణం

పెండ్లి అన్న త‌ర్వాత చాలా వ‌ర‌కు ప‌ట్టింపులు చూస్తారు.ముఖ్యంగా మ‌న ఇండియాలో జ‌రిగే పెండ్లిల‌లో ఇలాంటి త‌ర‌హా ఘ‌ట‌న‌లు చాలా ఉంటాయి.

 Garland Makes Bride To Cancel The Wedding Details, Wedding, Viral News, Wedding,marriage, Wedding Garland, Cancel Marriage, Uttarpradesh, Viral Wedding, Bride Groom,-TeluguStop.com

పెండ్లిలో భోజ‌నాలు స‌రిగ్గా పెట్ట‌క‌పోయినా.అక్క‌డ‌కు వ‌చ్చిన అతిథుల‌ను స‌రిగ్గా ప‌ట్టించుకోక‌పోయినా స‌రే అలిగి వెళ్లిపోవ‌డం లేదంటే ఏదో ఒక చిన్న గొడ‌వ‌ల్లాంటివి జ‌ర‌గ‌డం మ‌నం చాలా చూస్తుంటాం.

ఇక ప‌ల్లెటూర్ల‌లో ఇలాంటివి చాలా ఎక్కువ‌గా ఉంటాయి.అయితే ఈ ప‌ట్టింపులు చిన్నగా ఉంటే ప‌ర్లేదు గానీ.

 Garland Makes Bride To Cancel The Wedding Details, Wedding, Viral News, Wedding,marriage, Wedding Garland, Cancel Marriage, Uttarpradesh, Viral Wedding, Bride Groom, -పెండ్లిలో చిచ్చు రేపిన పూల‌మాల‌.. చివ‌ర‌కు ఎంత దారుణం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటి కార‌ణంగా ఘ‌ర్ష‌ణ ప‌డే దాకా ప‌రిస్థితి వెళ్లిందంటే మాత్రం అది ఎవ‌రికీ మంచిది కాదు.

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో చిన్న ఘ‌ట‌న ఏకంగా సంచలనం రేపింది.

పెండ్లిలో పూల దండ రేపిన చిచ్చు చివ‌ర‌కు పెండ్లి ఆగేదాకా తీసుకెళ్లింది.ఈ వార్త నెట్టింట్లో ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.

కొత్వాలి ప్రాంతంలో అంగ‌రంగ వైభవంగా పెండ్లి జ‌రుగుతోంది.అయితే వేదిక‌పై ఉన్న వ‌ధూవ‌రులు దండ‌లు మార్చుకుంటున్నారు.

అయితే వ‌ధువు మెడ‌లో దండ వేసే క్ర‌మంలో మెల్లిగా వేయ‌కుండా.ఆ వ‌రుడు విసేరేశాడు.

దీంతో వ‌రుడి తీరుపై వ‌ధువు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.తాను పెండ్లి చేసుకోనంటూ చెప్పేసింది.

దీంతో అక్క‌డున్న వారంతా షాక్ అయిపోయారు.వెంట‌నే బంధువులు వ‌చ్చి ఆమెకు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నాలు చేశారు.ఇక ఇరువైపు బంధువుల న‌డుమ ఘ‌ర్ష‌న జ‌రిగే దాకా వెళ్లింది.ఇక తాను స‌సేమిరా పెండ్లి చేసుకోబోనంటూ వ‌ధువు చెప్పేసింది.అయితే తాను దండ విస‌ర‌లేదంటూ వ‌రుడు చెప్పుకొచ్చాడు.అయినా స‌రే వ‌దువు మాత్రం పెండ్లి చేసుకునేది లేదంటూ చెప్పేసింది.

దీంతో పెండ్లికి ముందు ఇచ్చిన కానుక‌లు కూడా తిరిగి ఇచ్చేశారు.ఇలా పూల దండ ఆ ఇద్ద‌రి పెండ్లిని ఆపేసింది.

ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

Garland Makes Bride To Cancel The Wedding Details, Wedding, Viral News, Wedding,marriage, Wedding Garland, Cancel Marriage, Uttarpradesh, Viral Wedding, Bride Groom, - Telugu Groom, Uttarpradesh, Garland

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube