క‌రోనాను క‌ట్ట‌డి చేస్తున్న మౌత్‌వాష్.. బ‌య‌ట‌ప‌డ్డ కొత్త విష‌యాలు!

Gargling With Mouthwash Might Lower Spread Of Coronavirus! Mouthwash, Coronavirus, Covid-19, Latest News, Coronavirus Vaccine, Gargling

క‌రోనా వైర‌స్‌.ప్ర‌పంచ‌దేశాల్లో ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది.

 Gargling With Mouthwash Might Lower Spread Of Coronavirus! Mouthwash, Coronaviru-TeluguStop.com

చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ అగ్ర‌రాజ్యాల‌ను సైతం అత‌లాకుత‌లం చేస్తోంది.మాన‌వ మ‌నుగ‌డ‌కే పెద్ద ముప్పుగా మారిన క‌రోనా వైర‌స్‌.

ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు.మ‌రోవైపు ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు ఈ క‌రోనా భూతాన్ని మ‌ట్టు పెట్టే వ్యాక్సిన్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే వంద‌ల ప‌రిశోధ‌న‌లు చేస్తున్నా.ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్ రాలేదు.దీంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.రోజులు త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినా.

క‌రోనా మాత్రం అదుపులోకి రాలేదు.అయితే ఇలాంటి త‌రుణంలో క‌రోనా గురించి రోజుకో కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది.

తాజాగా జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో.మౌత్‌వాష్‌లతో పుక్కలిస్తే నోరు, గొంతులోని ప్రాణాంతక కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతోందని తేలింది.త‌ద్వారా ఇతరులకు కరోనా సంక్రమించే అవకాశం తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.అయితే మౌత్‌వాష్ యూజ్ చేసి కరోనాను నయం చేయడం సాధ్యం కాదని స్ప‌ష్టం చేశారు.

వాస్త‌వానికి క‌రోనా సోకిన వారిలో గొంతు, కావిటీల్లో అత్యధిక మొత్తంలో వైర‌స్ లోడ్ అయ్యి ఉంటుంది.అయితే ఎప్పుడైతే ద‌గ్గ‌డ‌మో లేదా ముక్కు చీదడమో లేదా శ్వాస వదిలినప్పుడో ఈ వైరస్‌ బయటకు వస్తోంది.

అప్పుడు ఇది ఇత‌రుల‌కు వ్యాప్తిచెందుతుంది.అయితే మౌత్‌వాష్‌లతో నోటిని పుక్కలించడం వల్ల‌ వైరస్‌ కణాల సంఖ్య తగ్గి సంక్రమణకు అవకాశాలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ముప్పై సెకన్ల పుక్కిలింత తరువాత వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

Gargling With Mouthwash Might Lower Spread Of Coronavirus! Mouthwash, Coronavirus, Covid-19, Latest News, Coronavirus Vaccine, Gargling - Telugu Coronavirus, Covid, Latest, Mouthwash

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube