ఫుట్ పాత్ పై చెత్త... బ్యాంకు కు రూ. 20 వేల జరిమానా  

Garbage On Foot Path Ghmc Fine To Bank-fine To Bank,garbage On Foot Path,ghmc,kotak Mahindra Bank,somajiguda,కోటక్ మహేంద్ర బ్యాంకు,జీ హెచ్ ఎం సి

చెత్త,వ్యర్ధాలను రోడ్డు పై పడేయకూడదు అని స్వచ్ఛ భారత్ పేరుతో అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కానీ ఇప్పటికీ చాలా మంది వ్యర్ధాలను బయటపడేస్తూనే ఉన్నారు. అయితే ఏమాత్రం పట్టించుకోకుండా కొందరు బ్యాంకు ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై చెత్తను రోడ్డు పై వేయడం తో ఏకంగా బ్యాంకు కే రూ..

ఫుట్ పాత్ పై చెత్త... బ్యాంకు కు రూ. 20 వేల జరిమానా -Garbage On Foot Path Ghmc Fine To Bank

20 వేలు జరిమానా విధించింది జీ హెచ్ ఎం సి. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమాజిగూడ లోని కోటక్ మహేంద్ర బ్యాంకు సమీపంలో నివసించే వారు కొన్ని సంచుల్లో వ్యర్ధాలను ఉంచడం తో పాటు చెత్తను సరిగ్గా బ్యాంకు ముందు ఉన్న ఫుట్ పాత్,రోడ్డు పై వేశారు. అయితే ఈ విషయం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడం తో అధికారులు అక్కడకి వెళ్లి కోటక్ మహీంద్రా బ్యాంకు వారికి ఏకంగా రూ.

20 వేలు జరిమానా విధించారు.

సమీపంలో ఉన్న వారు చెత్త తో పాటు దానిలో బ్యాంకు చెత్త కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో బ్యాంకు వారికి జరిమానా విధించారు అధికారులు. ఈ విధంగా చెత్తను చెత్త కుండీ లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా తప్పదు అంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తుంది..

దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా ప్లాస్టిక్ వాడకం,చెత్త ను రోడ్డుల పై వెళ్లడం వంటి చర్యలలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఎవరికీ నచ్చినట్లు వారు తమ సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో చెత్తతో నింపేసి రోగాలకు కారకులవుతున్నారు.