శ్రీకాకుళం జిల్లాలో ఘరానా మోసం

శ్రీకాకుళం జిల్లాలో కేటుగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు.అధికారులమని నమ్మించి ఓ వృద్ధురాలి వద్ద నుండి 13 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

 Garana Fraud In Srikakulam District-TeluguStop.com

సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన నిర్మలకుమారి అనే 65ఏళ్ల వృద్ధురాలు ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు రాశారు.డాక్టర్ల సూచనతో సమీపంలోి ల్యాబ్ కు వెళ్లి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పిలిచారు.

తర్వాత పోలీసులమని చెప్పిన కేటుగాళ్లు.ఒంటిమీద అంత బంగారం వేసుకుని తిరగద్దు.

వెంటనే తీసేసి బ్యాగులో వేసుకోండని చెప్పారు.వారి మాటలను నమ్మిన నిర్మలమ్మ బంగారం తీసి బ్యాగులో వేయమని కోరింది.

వేశామని వృద్ధురాలిని నమ్మించి అక్కడ నుంచి పంపించి వేశారు.కొంతదూరం వెళ్లకా బ్యాగు చూసుకోగా బంగారం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన నిర్మలమ్మ పోలీసులను ఆశ్రయించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube