గంటా మళ్లీ మళ్లీ అదే ధిక్కారమా ?

జగన్ మూడు రాజధానులు ప్రకటన పై తెలుగుదేశం పార్టీ ప్రాంతాల వారీగా విడిపోయినట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే ఈ ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు వ్యతిరేకించగా, టిడిపి నాయకులు, ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా జగన్ నిర్ణయాన్ని సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Ganta Srinivasarao Vizag Capital Ys Jagan-TeluguStop.com

జగన్ ప్రకటనపై ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన నాయకులు స్వాగతిస్తూ ఉండగా కోస్తా జిల్లాలకు చెందిన టిడిపి ప్రజాప్రతినిధులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.అయితే ఎవరూ బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు.

తాజాగా ఇదే అంశంపై విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి స్పందించారు.

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని గంటా చెప్పుకొచ్చారు.

అసలు పార్టీల సంగతి పక్కన పెడితే తాను జగన్ ప్రతిపాదించిన అంశాన్ని స్వాగతిస్తున్నా అంటూ చెప్పారు.విశాఖ వాసిగా ఈ ప్రాంతంతో ప్రగాఢ అనుబంధం ఉన్న వ్యక్తిగా దీనిని స్వాగతిస్తున్నామని, రాజధానిపై ఎప్పుడు ఎక్కడ ఏ చర్చ జరిగినా వ్యక్తిగతంగా తాను సమర్థిస్తాను అంటూ గంటా చెబుతున్నారు.

అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలోనే విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని తాను మాట్లాడిన సంగతిని గుర్తు చేశారు.పార్టీల పరంగా చూసుకుంటే ఈ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకించినా తాను మాత్రం విశాఖ వాసిగా అంగీకరిస్తున్నాను అంటూ ఆయన చెప్పారు.

అసలు జగన్ రాజధానిపై ప్రకటన చేసిన మొదటి రోజునే టిడిపి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ఆందోళన చేయడంతో జరిగింది.అయితే గంటా ఒక్కరే జగన్ కు మద్దతుగా మాట్లాడారు.

టిడిపి నిర్ణయానికి వ్యతిరేకంగా గంట శ్రీనివాసరావు గళం ఎత్తడం ఇది రెండోసారి.ప్రస్తుతం గంటా పార్టీ మారే ఆలోచనలో ఉండడంతో దీనిపై ఆ పార్టీ నుంచి ఎవరు స్పందించలేని పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube