అవంతికి చెక్ పెట్టేందుకు ఆ మంత్రితో స్నేహం... గంటా వైసీపీ ఎంట్రీలో న‌యా ట్విస్ట్‌..!

మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైసీపీ ఎంట్రీ కాస్త లేట్ అయ్యేలా క‌నిపిస్తోంది.వాస్త‌వంగా చూస్తే ఆగ‌స్టు నెల‌లోనే ఆయ‌న వైసీపీలో చేరేందుకు రెండు, మూడు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు.

 Ganta Srinivasa Rao Ysrcp Entry In New Twist, Ganta Srinivasa Rao, Ysrcp, Tdp,-TeluguStop.com

అయితే ఆయ‌న ప్ర‌త్య‌ర్థిగా ఉన్న విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన ప్ర‌చారం ఇప్పుడు గంటా నెత్తిన పాలు పోసింద‌ని జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.గంటా సైలెంట్‌గానే ఉన్నా ఆయ‌న వైసీపీ ఎంట్రీని అడ్డుకునేందుకు అవంతి మీడియా ముందు ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు.

అక్క‌డితో ఆగ‌ని అవంతి విజ‌య‌సాయితో కూడా గంటాను టార్గెట్ చేయించార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో గంటా తాను బీజేపీలోకి వెళుతున్నాన‌న్న సంకేతాలు కూడా బ‌య‌ట‌కు వ‌దిలారు.

దీంతో ఇప్పుడు వైసీపీ అధిష్టాన‌మే డైన‌మాలో ప‌డిన‌ట్ల‌య్యింది.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం గంటా పార్టీలోకి వ‌చ్చే విష‌యంలో నిన్న‌టి వ‌ర‌కు ఫ్రీగానే ఉండ‌గా.

ఇప్పుడు కండీష‌న్లు పెడుతున్నార‌ట‌.ఆయ‌న చెప్పిన కండీష‌న్ల‌కు ఒప్పుకోక‌పోతే బీజేపీలోకి వెళ‌తాన‌న్న సిగ్న‌ల్స్ పంపుతుండ‌డంతో వైసీపీ ఇప్పుడు ఆయ‌న అడిగిన హామీలు నెర‌వేరుస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.బెట్టుతో వైసీపీలోకి వెళితే కీల‌క‌మైన వీఎంఆర్డీయే పోస్టు ద‌క్కించుకోవ‌చ్చ‌న్న‌ది గంటా ప్లాన్‌గా తెలుస్తోంది.గ‌తంలో ఈ ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు గంటా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న ఈ ప‌ద‌వి త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్నారు.విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల‌కు విస్త‌రించి ఉన్న ఈ సంస్థ చైర్మ‌న్‌కు కేబినెట్ హోదా ఉంటుంది.భారీ ల్యాండ్ బ్యాంక్ వీఎంఆర్డీయే కింద ఉంది.2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ లేదు.అందుకే బీజేపీలోకి వెళ్లేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌.ఇప్పుడు నాలుగేళ్లు బంగారు భ‌విష్య‌త్తును వ‌దులుకుని బీజేపీలోకి వెళ్లే రాంగ్ స్టెప్ వేసేందుకు ఆయ‌న ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌.

అందుకే వైసీపీలోకే వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటోన్న గంటా కాస్త బెట్టుతో త‌న డిమాండ్ల‌ను నెర‌వేర్చుకునేందుకు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న రెండు రోజుల క్రిత‌మే ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను క‌లిశార‌ట‌.

కిర‌ణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు కేబినెట్ స‌హ‌చ‌రులుగా ఉన్న వీరిద్ద‌రి మ‌ధ్య పొసిగేది కాదు.అయితే ఇప్పుడు గంటా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోస‌మే అవంతికి చెక్ పెట్టే క్ర‌మంలో బొత్స‌కు ద‌గ్గ‌రైన‌ట్టు టాక్‌.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube