'గంటా ' సౌండ్ పెంచారు ! కలిసొచ్చిన విజయం

మాజీమంత్రి, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

 Ganta Srinivasa Rao Supported Candidate Vepada Chiranjeevi Rao Wins In Mlc Elect-TeluguStop.com

ఒక దశలో ఆయన వైసీపీలో చేరెందుకు సిద్ధమయ్యారు.ఈ మేరకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

జగన్ కూడా గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే విశాఖ జిల్లాకు చెందిన వైసిపి కేలకనేత , మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు,  విజయసాయిరెడ్డి గంటా చేరికకు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఈ మేరకు జగన్ పై ఒత్తిడి చేయడంతో గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయిపోయారు.

ఇక టీడీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.ఏదో విధంగా వైసీపీలో చేరాలని పట్టుదలతో ఉంటూ వచ్చిన ఆయన ఇక ఆ పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో,  ఈ మధ్యకాలంలోనే మళ్లీ టిడిపిలో యాక్టివ్ అవుతున్నారు.

అయినా చంద్రబాబు( Chandrababu naidu ) దగ్గర గంటా కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదు.

ఒక దశలో జనసేన లోకి  వెళ్లదుకు ప్రయత్నించారు.

విశాఖలో పవన్  కార్యక్రమాలు చేసిన సమయంలో తన ప్రధాన అనుచరులు జనసేన కార్యక్రమంలో పాల్గొనడంతో గంటా జనసేనలో చేరుతున్నారని ప్రచారం జరిగింది.కానీ ఎందుకు తెలియదు గానీ సైలెంట్ అయిపోయారు.

అయితే ఇప్పుడు మళ్లీ టీడీపీలో ఆయన యాక్టివ్ అయ్యారు.విశాఖ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత , మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుతో గంటా శ్రీనివాసరావుకు విభేదాలు ఉన్నాయి.

ఇది ఎలా ఉండగానే ఇటీవల వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ లో ఉత్తరాంధ్ర టిడిపి అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడు బలపరిచిన గాడు చిన్న కుమారి లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు.

Telugu Ap, Jagan, Janasena-Politics

ఆమె ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు ఓటర్ల నమోదు పైన దృష్టి పెట్టారు.అకస్మాత్తుగా గంటా శ్రీనివాసరావు టిడిపి అభ్యర్థిగా ఉత్తరాంధ్రకు చెందిన లెక్చరర్ వేపాడ చిరంజీవిరావును( Vepada chiranjeevi rao ) తెరపైకి తీసుకువచ్చారు.ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు వద్దకు పంపించారు.

చిరంజీవి రావ్ అయితే సామాజికంగా , ఆర్థికంగా ఓట్ల పరంగా బలమైన అభ్యర్థి అనే విషయాన్ని గంటా టిడిపి హైక్రామాండ్ వద్ద పరోక్షంగా వినిపించారు.దీంతో చిరంజీవిరావును టిడిపి అభ్యర్థిగా ప్రకటించింది.

టిడిపి అభ్యర్థుల తరఫున గంటా ప్రచారం చేయడంతో పాటు,  అనేక రాజకీయ వ్యవహాలు పన్నారు.అవి సక్సెస్ కావడంతో టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి విజయం సాధించారు.

Telugu Ap, Jagan, Janasena-Politics

ఆ విజయంతో గంటా హవా టిడిపిలో ఒక్కసారిగా  పెరిగిపోయింది .ఎన్నికల కౌంటింగ్ సమయం నుంచి వైసిపి ప్రభుత్వంపై గంటా విమర్శలు మొదలుపెట్టారు.ఇక పూర్తిగా టిడిపిలోనే యాక్టివ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.జనసేన,  టిడిపి కలిస్తే ఏం జరగబోతుందనేది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని చెబుతూ జనసేనను కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన మద్దతు ఉంటే తన సీటుతో పాటు,  రాష్ట్రవ్యాప్తంగా టిడిపికి ఇబ్బండ ఉండగానే విషయాన్ని గంటా తెరపైకి తెస్తూ పార్టీలో తన ప్రాధాన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube