బిగ్ బ్రేకింగ్: జగన్ పార్టీకి ట్విస్ట్ ఇస్తూ రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు …!!

విశాఖ ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా డ్రామా కి తెరపడింది.ఎప్పటినుండో ఆయన వైసీపీ లోకి వస్తారని అందరూ భావించగా… తాజాగా జగన్ పార్టీకి ట్విస్ట్ ఇస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

 Ganta Srinivas Rao Resigns Ycp By Giving Twist To Jagan, Ganta Srinivas Rao,ys J-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ నీ ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖలో కార్మిక సంఘాలు అంతా రోడ్డెక్కి ఆందోళనలు నిరసనలు చేపడుతూ ఉన్నాయి.

ఈ సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు వైసిపి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పోరాటానికి దిగాలి అంటూ.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ .అసెంబ్లీ స్పీకర్ కి తన రాజీనామా పత్రాన్ని పంపారు.అంతేకాకుండా తన రాజీనామా లో ఒక కండిషన్ కూడా పెట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర నిర్ణయం అమల్లోకి రాగానే తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ ను కోరారు.పరిస్థితి ఇలా ఉండగా త్వరలోనే విశాఖ ఉక్కు కర్మాగారం పర్యవేక్షణ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఎలాగైనా విశాఖ స్టీల్ కర్మాగారం ప్రైవేటీకరణ అవకుండా అడ్డుకుంటామని గంటా పేర్కొన్నారు. 

Telugu Budget, Resign, Vishaka Steel, Ys Jagan, Ysrcp-Telugu Political News .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube