గతి తప్పి అతి చేస్తున్న నేతలు ... టీడీపీలో ఇదో టెన్షన్ !

క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ.ఏ పార్టీలో కనిపించని డిసిప్లేన్ ఆ పార్టీలో కనిపిస్తుంటది.

 Ganta Srinivasa Rao Over Action In Tdp-TeluguStop.com

అధిష్టానం మాటే అందరికి శిలాశాసనం.అందుకే ఎన్ని వడిదుడుకులు వచ్చినా పార్టీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అన్నిటిని తట్టుకుని నిలబడుతోంది.

అయితే ఆ పరిణామాలు అన్ని ప్రతుతం టీడీపీలో కనిపించడంలేదు.పార్టీ అధికారం లో ఉంది.

నాయకులూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు.ఆఖరికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ని సైతం లెక్కచేయలేనంత స్థాయికి పార్టీలో నాయకులు వెళ్లిపోయాయి తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు.

ప్రభుత్వంపై నేతలు తిరుగుబాటు చేసేదాకా.అధిష్ఠానం పట్టించుకోవడం లేదా.లేకుంటే పట్టడం లేదా? తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకంటే భిన్నమైనదని ఆ పార్టీనేతలు చెప్పుకుంటూ ఉంటారు.క్రమశిక్షణ తమ బ్రాండ్‌ అనేది టీడీపీ ఊతపదం.

అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకొచ్చాక పార్టీలో కట్టుబాట్ల విషయంలో కొందరు తమ పరిధి దాటారు.కొద్ది రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు టీడీపీ అధిష్ఠానంపై అలిగి పార్టీకి దూరంగా ఉన్నారు.

అనంతరం పార్టీ పెద్దల మంతనాలతో మెత్తబడ్డారు ఒక మంత్రి స్థాయిలో ఉన్న నాయకుడే ఇలా చేస్తే ఇక కిందిస్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటి.?

ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నేతలు వచ్చిన తరువాత దశాబ్ధాల టీడీపీ బ్రాండ్‌కి నష్టం కలిగే పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి.చిన్న నేతల నుంచి మంత్రులు, ఎంపీలదాకా రచ్చకెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే మంత్రి గంటా విషయంలో మాత్రం ఈ పరిణామాలు తారాస్థాయికి వెళ్లాయనే మాట వినిపిస్తోంది.

కేబినెట్ సమావేశానికి రాకుండా.సీఎం కార్యక్రమానికి సైతం దూరంగా ఉంటానంటూ పార్టీపై అలిగారు.

మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, వర్గ పోరు పెద్ద విషయం కాకపోయినా.అధినాయకత్వంతో విభేదించి నిరసనకు దిగడం మాత్రం చిన్న విషయం కాదు.అయితే ఇలాంటి పరిణామాలు పార్టీలో గాని, ప్రభుత్వంలో జరుగుతున్నా.చివరిదాకా పార్టీ పెద్దలు గుర్తించడం లేదు.

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి విషయంలో కూడా చివరి నిమిషందాకా స్పందించకపోవడం వల్లే పరిస్థితి చెయ్యిదాటిపోయిందని అభిప్రాయపడుతున్నారు.

పాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ఎక్కువ బిజీ అయిపోవడం వలన ఇటువంటి విషయాలు ఆయన దాకా వెళ్లడానికి చాలా సమయం పడుతోంది.

ఈ లోపే విషయం సీరియస్ అయిపోతోంది.మంత్రులు డీల్ చెయ్యలేని అంశాలపై.నేరుగా లోకేష్ రంగంలోకి దిగితే మంచిదని కొందరు నేతలు సూచిస్తున్నారు.మంత్రులు చెప్పిన దానికంటే.

లోకేష్ నుంచి వచ్చే ప్రతిపాదనలు, హామీల్ని ఆయా నేతలు నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంది.

వివాదాలు తలెత్తినప్పుడు సీనియర్లతో పాటు లోకేష్ కూడా బాధ్యత తీసుకుంటే చంద్రబాబు కి కూడానా కొంచెం తలనొప్పి తగ్గుతుంది.

అలాగే అసంతృప్తులు ముదరకముందే మాట్లాడి సెట్ చేయవచ్చు.అసలే ముందస్తు ఎన్నకలంటూ తెగ హడావుడి చేసేస్తున్నారు.ఈ సమయంలో పార్టీలో అసంతృప్తులు లేకుండా చేసుకుని పరిపాలనపై దృష్టిపెడితే బాగుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube