గంటా పార్టీ మారడం ఖాయమే ? కానీ సస్పెన్స్ !  

Ganta Srinivasa Rao Joining Ysrcp Are Bjp-ganta Srinivasa Rao,tdp Leasers,ys Jgan,ysrcp Are Bjp

తెలుగుదేశం పార్టీలో జంపింగ్ జపాంగ్ ల హడావుడి ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. పార్టీ అధికారంలో లేకపోవడం, భవిష్యత్తులోనూ కోలుకునే పరిస్థితి లేకపోవడంతో చాలామంది అధికారంలో ఉన్న పార్టీల వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తే టీడీపీకి రాబోయేది కష్టకాలమే అని అందరికి అర్ధం అయిపొయింది..

గంటా పార్టీ మారడం ఖాయమే ? కానీ సస్పెన్స్ !-Ganta Srinivasa Rao Joining Ysrcp Are BJP

అందుకే ఇప్పటి నుంచే తమకు అనువైన పార్టీలను వెతుక్కుని వెళ్లిపోతున్నారు. ప్రస్తుతానికి టీడీపీ తరపున గెలిచిన మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు కూడా టీడీపీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన అసలు ఎన్నికలకు ముందే పార్టీ మారిపోతారనే వార్తలు వచ్చినా ఆయన మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు.

వాస్తవంగా అధికారం ఎటువైపు ఉంటే గంటా చూపు అటువైపు ఉంటుంది అనే విమర్శలు ఆయన మీద ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో గంటా చూపు ఏ పార్టీ వైపు ఉంటుంది అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. గత కొంత కాలంగా గంటా చాలా సైలెంట్ గా ఉంటున్నారు.

ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు మాత్రం వైసీపీ నాయకులను పల్లెత్తు మాట కూడా అనే సాహసం అయితే చేయడంలేదు. అంతే కాదు టీడీపీ తరపున గట్టిగా వాయిస్ వినిపించడానికి కూడా గంటా సాహసించడంలేదు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా గంటా మాత్రం అస్సలు స్పందించడం లేదు.

కనీసం ఈ విషయంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద గా స్పందించడంలేదు.

విశాఖ జిల్లాల్లో గంటాకు ఉన్న పట్టు కారణంగా ఆయన్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గంట మాత్రం వైసీపీ లో చేరేందుకు చూస్తున్నారు. కానీ పార్టీ మారితే అనర్హత వేటు ఖాయం అనే జగన్ హెచ్చరికల నేపథ్యంలో పార్టీ మారే విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

అన్ని పరిస్థితులు అనుకూలిస్తే బీజేపీలోకి కానీ వైసీపీలోకి కానీ గంటా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన టీడీపీకి, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.