వైసీపీ లో చేరికకు అంతా సిద్ధం చేసుకున్న గంటా  

Ganta Srinivas Rao to Join YCP party soon , YCP , Ganta Srinivas Rao, Avanthi, TDP - Telugu Avanthi, Ganta Srinivas Rao, Ganta Srinivas Rao To Join Ycp Party Soon, Tdp, Ycp

టీడీపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ పార్టీ లో చేరడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఆయన త్వరలో పార్టీ మారుతున్నట్లు ఇప్పటికే గత కొద్దీ రోజుల నుంచి ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు తాజాగా దానిపై ఒక క్లారిటీ వచ్చింది.

TeluguStop.com - Ganta Srinivasa Rao Join Ycp Soon

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ నెలలోనే వైసీపీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.ముందుగా ఆగస్టు 15 న వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా 16 వ తేదీన ఆయన ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.

TeluguStop.com - వైసీపీ లో చేరికకు అంతా సిద్ధం చేసుకున్న గంటా-General-Telugu-Telugu Tollywood Photo Image

తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటా తో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.మరోపక్క గంటా పార్టీ మార్పు పై వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చేసిన అరాచకాలు, కేసుల వల్ల అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడం కోసం దొడ్డిదారిలో పార్టీ లోకి వస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికారం కోరుకొనే పక్షి గంటా అంటూ అవంతి వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఆయన భూకుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొన్నారు అని, ఎంపీ విజయ సాయిరెడ్డి,నేను మాట్లాడామని గుర్తు చేశారు.ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న గంటా ఇక ఇప్పుడు నేరుగా పార్టీ నేతగా మారిపోనున్నారు.

ఒకప్పుడు మిత్రులుగా ఉన్న గంటా,అవంతి ఇప్పుడు శత్రువులు గా మారారు.మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్న వీరిలో ఒకరు పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కాగా, మొన్నటి దాకా మంత్రిగా ఉన్న అయన పార్టీ ఓడిపోవడంతో ఎమ్మెల్యేగా సరిపెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ఆయన మళ్లీ అవంతి ఉన్న పార్టీ అనగా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు అన్న ప్రచారం మొదలుకావడం తో అవంతి తనదైన శైలి లో మండిపడ్డారు.కావాలని కేసుల నుంచి తప్పించుకోవాలి అని గంటా ఇలా దొడ్డి దారిలో పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నారు అంటూ ఆరోపించారు.

మరి అసలకే గంటా పేరు చెబితేనే మండిపడుతున్న అవంతి ఈనెల 16న గంటా వైసీపీ లో చేరితే ఈయన ఎలా స్పందిస్తారో చూడాలి.

#Avanthi #GantaSrinivas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ganta Srinivasa Rao Join Ycp Soon Related Telugu News,Photos/Pics,Images..