'ఆ మంత్రి..ఆఎమ్మెల్యే' టార్గెట్ గా ఐటీ దాడులు..?  

Ganta Srinivasa Rao And Yarapathineni Are In The It Hit List-

 • ఏపీలో జరిగిన ఐటీ దాడులతో టీడీపీ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. నేతల ఆస్తులే టార్గెట్ గా చేసుకున్న ఐటీ టీడీపీ కి చెందిన బడా బడా వ్యక్తులకి ముర్చెమటలు పట్టించింది.

 • 'ఆ మంత్రి..ఆఎమ్మెల్యే' టార్గెట్ గా ఐటీ దాడులు..?-Ganta Srinivasa Rao And Yarapathineni Are In The IT Hit List

 • తెలంగాణా మీదుగా ఏపీ వచ్చిన తుఫానులా ఐటీ తుఫాను తమ్ముళ్ళ తో గుటకలు వేయించింది. కీలక నేతలుగా చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీలపై కన్నేసింది ఫలితం సుజనా , నారాయణ, మస్తాన్, సీఎం రమేష్ ఆస్తులపై దాడులు చేసి కీలక ఆధారాలు సేకరించింది.

 • ఎవరూ కిక్కురు మనకుండా రేపో మాపో అరెస్టులు అనే పదాలు చూచాయిగా లీకులు ఇచ్చింది దాంతో ఎక్కడికక్కడ దొంగలు గప్చుప్ అయ్యారు. ఐటీ కూడా సైలెంట్ అయ్యింది.

 • అయితే ఐటీ అధికారులు మళ్ళీ జూలు విదుల్చుతారని అస్సలు ఊచించని కొందరు నేతలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అనూహ్యంగా విశాఖలో దాదాపు 70 మంది ఐటీ అధికారులు దిగడంతో మళ్ళీ తమ్ముళ్ళు ఉలిక్కిపడ్డారు . ఏమ్వీపీ కాలనీలో ఉన్న ఐటీ కార్యాలయం వద్ద ఉన్న ఐటీ అధికారులు వివిధ ప్రాంతాలలో సోదాలు చేయడానికి సిద్దమయ్యారు. విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభంకాగా, విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

 • హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగబోతున్నాయి.

  Ganta Srinivasa Rao And Yarapathineni Are In The IT Hit List-

  కొన్ని ఐటీ బృందాలు బయలుదేరి గాజువాకలోని సెజ్‌లోకి వెళ్లాయి. అందులోని ట్రాన్స్‌వరల్డ్‌ బీచ్‌ శాండ్‌ కంపెనీలో సోదాలు జరుపుతున్నారు.

 • అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలోనే వేచి ఉన్న మరికొన్ని బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు కాసేపట్లో వెళ్లనున్నారని తెలుస్తోంది.మరో కొంత మంది టీడీపీ మంత్రులు , ఎమ్మెల్యే ల ఇళ్ళపై కూడా ఐటీ దాడులు జరుగనున్నాయని వినికిడి.

 • ముఖ్యంగా విశాఖపట్నంలో రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి ‘గంటా శ్రీనివాసరావు’ ఆస్తులపై దాడులకు ప్లాన్‌ చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

  Ganta Srinivasa Rao And Yarapathineni Are In The IT Hit List-

  ఇక గుంటూరు జిల్లాకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని భంధువులు కూడా ఐటీ హిట్ లిస్టులో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. యరపతినేని శ్రీనివాసరావు’ వియ్యంకుడు ‘ప్రేమ్‌ హరిబాబు’ సంస్థ అయిన ప్రేమ్‌గ్రూప్‌లపై దాడులు చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ అయిన ప్రేమ్‌గ్రూప్‌ సంస్థపై దాడులు చేస్తే…టిడిపికి చెందిన ఎమ్మెల్యే ‘యరపతినేని’ అక్రమాలు కూడా బయటకు వస్తాయనే భావనతోనే ఈ దాడులను ఐటి అధికారులు చేస్తోన్నట్లు తెలుస్తోంది. యరపతి నేని చంద్రబాబు బినామీ అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు ఎన్నో సార్లు మీడియా సాక్షిగా ప్రకటనలు చేశారు కూడా.మరి ఈ రోజు మొదలయిన ఈ దాడులు ఎన్నిరోజులు వరకూ కోసాగుతాయో.

 • ఎవరిని ఐటీ చివరిగా టార్గెట్ చేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా వ్యక్తిగత కక్షతోనే బిజెపి పెద్దలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు తాజాగా ఐటి దాడులు మరోసారి నిదర్శనంగా నిలుస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.