బీజేపీలోకి చిరంజీవి ? 'గంటా' తంటాలు మాములుగా లేవే  

Ganta Srinivas Rao Try To Keep Chiranjeevi In Bjp Party - Telugu Avanthi Srinivas Rao, Ganta Srinivas Rao, Mega Star Chiranjeevi, Saira Narasimha Reddy, Tdp

‘సైరా’ సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది.దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై అనేక కథనాలు మొదలయ్యాయి.

Ganta Srinivas Rao Try To Keep Chiranjeevi In Bjp Party

చిరు రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు సంపాదించడం, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.ఆ తరువాత కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చిరంజీవి.

ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నా ఆ పార్టీకి తనకు సంబంధం ఏమీ లేనట్టుగానే దూరం పాటిస్తూ వస్తున్నాడు.ఏది ఏమైనా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చిరు క్రేజ్ బాగా తగ్గింది.

బీజేపీలోకి చిరంజీవి ‘గంటా’ తంటాలు మాములుగా లేవే-Political-Telugu Tollywood Photo Image

తన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్లినా చిరు మాత్రం జనసేన పార్టీలో చేరకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.కనీసం ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కూడా ఆయన వెళ్లలేదు.

దీంతో ఇక భవిష్యత్తులో కూడా ఆయన రాజకీయాల వైపు రారని అంతా డిసైడ్ అయిపోయారు.

కానీ ప్రస్తుతం ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవిని పొలిటికల్ గా యాక్టివ్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.గంటా టీడీపీలోని కొనసాగుతున్న ఆయన చాలా కాలంగా అధికార పార్టీ వైసీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.కానీ అక్కడ వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన రాకకు బ్రేకులు వేస్తున్నారు.

దీంతో ప్రత్యామ్నాయంగా బిజెపిలోకి వెళ్లేందుకు ఆయన పావులు కదుపుతున్నారు.తనతోపాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా బిజెపిలోకి తీసుకు వెళ్లి తన పరపతిని పెంచుకోవాలని గంటా ప్రయత్నిస్తున్నారు.

ఇక చిరు రాకపై బిజెపి అగ్ర నేతలు కూడా సానుకూలంగా ఉండడంతోపాటు ఆయన బిజెపిలో చేరగానే బిజెపి సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రకటించి ఏపీలో బిజెపికి బలమైన పునాదులు వేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది.ఈ నేపథ్యంలోనే బీజేపీలోకి చిరుని ఎలా అయినా తీసుకువచ్చేలా ఒప్పించాలని గంటాకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.అయితే చిరు మాత్రం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.తమ్ముడు స్థాపించిన జనసేన కాదని బిజెపి లో చేరితే తమ కుటుంబంలో వైరాలు వస్తాయని, జనసేన రాజకీయ భవిష్యత్తు కూడా ఇది పెద్ద అవరోధంగా మారుతుందని చిరు అభిప్రాయపడుతున్నడట.

కానీ గంటా మాత్రం చిరును ఏదో ఒక రకంగా ఒప్పించి బీజేపీలో చేర్చాలని చూస్తున్నాడు.ఆయన ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు