ఏపీ టీడీపీ నేతలు ఇప్పుడు చాలామంది బీజేపీలోకి వెళ్లేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు అనే వార్త చాలాకాలంగా వినిపిస్తోంది.ఒకమారు ఢిల్లీ స్థాయిలో చర్చలు కూడా పూర్తయ్యాయనే వార్తలు కూడా బలంగా వినిపించాయి.
పార్టీ మారాలన్న నేతలందందరికి ఘంటా శ్రీనివాసరావు నేతృత్వం వహిస్తున్నారని ఆయన ఆధ్వర్యంలోనే వీరంతా పార్టీ మారుతున్నారు అనే విషయం కూడా గుప్పుమంది.దీనికి తగ్గట్టుగానే మాజీ మంత్రి ఘంటా కూడా పదే పదే ఢిల్లీ కి వెళ్లడం, బీజేపీ నేతలతో చర్చలు జరపడం జరిగిపోయాయి.
అలాగే ఏపీలో బీజేపీ ఫైర్ బ్రాండ్, సొంత సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుతో కూడా ఆయన చర్చలు జరుపుతూ ఉండేవారు.టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని కూడా సోము అప్పట్లోనే బాంబు పేల్చారు.
ఇంత జరిగినా ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ వైపుకి వెళ్ళలేదు.అలాగే ఘంటా కూడా ఏ పార్టీలోకి వెళ్లకుండా సైలెంట్ గా ఉండిపోయారు.

వాస్తవానికి ఘంటాకు బీజేపీలోకి వెళ్లే ఆలోచనే లేదు.ఆయన మనసంతా వైసీపీ వైపే ఉంది.ఎందుకంటే ఆయనకు రాష్ట్ర రాజకీయాలు అంటే బాగా ఇష్టం.పైగా జగన్ బలమైన నేతగా ఏపీలో ఉన్నారు.అవునన్నా కాదన్నా ఆయన నాలుగున్నరేళ్ళ పాటు అధికారంలో ఉంటారు.అందువల్ల వైసీపీలో చేరి మంత్రి కావాలన్నది గంటా శ్రీనివాసరావు మొదట్లో అనుకున్న ఆలోచన.
అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా గంటా శ్రీనివాసరావు రెడీ అయ్యారు.కానీ ఈ కల నెరవేరకుండా జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుపడడంతోనే ఆ వ్యూహం బెడిసికొట్టిందనే ప్రచారం జరిగింది.
ఈ లావాదేవీలు ఇలా ఉండగానే బీజేపీ నేతలు కూడా గంటా శ్రీనివాసరావును సంప్రదించడంతో గంటా శ్రీనివాసరావు వారితో కూడా చర్చలు జరిపారు.అయితే గంటాను బీజేపీలోకి రమ్మంటున్న బీజేపీ నేతలు కూడా ఆయనతో పాటు ఎక్కువ సంఖ్యలో టీడీపీయే ఎమ్యెల్యేలను తీసుకువస్తే ఏదో ఒక కీలక పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇస్తున్నా ఘంటా మనసు మాత్రం వైసీపీ వైపే చూస్తోందట.

ఇక టీడీపీలోని ఎమ్మెల్యేలు జగన్ పిలిస్తే వైసీపీలోకే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు.తప్ప బీజేపీ వైపు వెళ్లేందుకు ఇష్టపడడంలేదన్నట్టుగా తెలుస్తోంది.పదే పదే బీజేపీ నేతలు తమ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పినా కూడా ఆచరణలో మాత్రం అది అమలు అవ్వకపోవడానికి కారణం ఇదేనట.ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లేకంటే టీడీపీలో ఉండడమే బెటర్ అన్న ఆలోచన వారిలో ఎక్కువ కనిపిస్తోంది.
ఈ కారణంగానే గంటా శ్రీనివాసరావు సైలెంట్ గానే ఉంటున్నారని అంటున్నారు.బీజేపీ నేతలు ఎంత చెప్పినా కూడా ఏపీలో టీడీపీ నేతల మొదటి ఆప్షన్ వైసీపీగానే ఉంది.
దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఏపీలో ఆ పార్టీకి అంతగా పట్టు లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.