ఆ మాజీ మంత్రి అరెస్ట్ తప్పదని 'గంట' గంటకి గుర్తుచేస్తున్న వైసీపీ ?

ఏ నాయకుడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియని పరిస్థితి ఉండడంతో, తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆందోళనలో గత కొంత కాలంగా ఉంటున్నారు.ఇప్పటికే అచ్చెన్న, కొల్లు రవీంద్ర వంటి మాజీ మంత్రులు అరెస్ట్ కాగా, మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు , నియోజకవర్గ స్థాయి నాయకులు అనేక కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ అయ్యారు.

 Ganta Srinviasa Rao, Avanthi Srinivas, Vijaya Sai Reddy Tweet, Ycp Govt, Ganta A-TeluguStop.com

ఎప్పుడు ఏ నాయకుడు అరెస్ట్ అవుతాడో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో దాదాపుగా టిడిపి నాయకులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.యాక్టివ్ గా ఉండాలంటూ పార్టీ పిలుపు ఇస్తున్నా, పెద్దగా స్పందించడం లేదు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ అరెస్ట్ ల వ్యవహారంలో మరో మాజీ మంత్రి, విశాఖ జిల్లా టిడిపి నాయకుడు గంటా శ్రీనివాసరావు వచ్చి చేరారు.త్వరలో వైసిపి కీలక నాయకులు, మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.

రెండు మూడు రోజులుగా ఈ తరహా ర్యాగింగ్ ఎక్కువ కావడంతో త్వరలోనే గంటా శ్రీనివాస రావు అరెస్ట్ తప్పదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పెట్టిన పోస్టింగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

గత టీడీపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేపట్టారు.దీనికి 12 కోట్లు ఖర్చు కాగా, ఇందులో సుమారు ఐదు కోట్ల వరకు అవినీతి జరిగిందనే విషయాన్ని ఇప్పుడు విజయసాయిరెడ్డి లేవనెత్తి విమర్శలు మొదలు పెట్టారు.

త్వరలోనే గంటా అరెస్టు తప్పదనే సంకేతాలను ఆయన ఇస్తున్నారు.

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు.

త్వరలోనే ఆయన హడావుడి తప్పదు అంటూ హడావుడి చేస్తున్నారు.ఈ తరహా ర్యాగింగ్ పై గంటా శ్రీనివాసరావు పెద్దగా స్పందించకపోయినప్పటికీ, ఆయన కూడా ఆందోళనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటికే ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, వైసీపీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, ఆయన సైలెంట్ గా ఉండి పోయారు.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులను వేధిస్తూ, అరెస్టులు చేయిస్తూ, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అనే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి టీడీపీ ఎంపీలు తీసుకువెళ్లారు.

Telugu Ganta, Gantasrinviasa, Vijayasai, Ycp-Telugu Political News

ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇప్పుడు గంటాను టార్గెట్ చేసుకుంటూ, వైసీపీ కీలక నాయకులు వ్యాఖ్యలు చేస్తుండడంతో, మరో రెండు మూడు రోజుల్లో అరెస్టు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమ అఖిలప్రియ వ్యవహారంలోనూ ఇదే వైఖరితో ఉన్నట్లుగా కనిపిస్తోంది.అరెస్టుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నా, లెక్కచేయకుండా ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube