చంద్ర‌బాబుపై ఆ మంత్రి తిరుగుబాటు..?       2018-06-20   00:01:42  IST  Bhanu C

టీడీపీలో ఏదో జ‌రుగుతోంది.. మంత్రివ‌ర్గంలో ప‌లువురు గుర్రుగా ఉన్నారు.. కొంద‌రు త‌మ అసంత‌`ప్తిని బ‌య‌ట‌కు వెల్ల‌గ‌క్కుతున్నారు.. మ‌రికొంద‌రు మాత్రం సైలెంట్‌గా ఉంటూనే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తిరుగుబాటు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో విద్యాశాఖ మంత్రి గంట శ్రీ‌నివాస‌రావు ముందువ‌రుస‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశానికి గంట శ్రీ‌నివాస‌రావు హాజ‌రుకాక‌పోవ‌డంతో పై వాద‌న‌కు మ‌రింత బాలాన్ని ఇస్తోంది.

క‌నీసం చంద్ర‌బాబుకు స‌మాచారం కూడా ఇవ్వ‌లేద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌లు అంశాల్లో సీఎం చంద్ర‌బాబు, మంత్రి గంటా మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. గంటా శ్రీ‌నివాస‌రావు తిరుగుబాటు చేయ‌డానికి చాలానే కార‌ణాలు ఉన్నాయ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. విద్యాశాఖ‌లో ప‌లు ప్రాజెక్టుల విష‌యంలో మొద‌లైన విభేదాలు.. రోజురోజుకూ పెరుగుతూ వ‌చ్చాయి. దీంతో కొంత కాలంగా వారిమ‌ధ్య గ్యాప్ బాగా వ‌చ్చిన‌ట్లు ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇక ఓ ప‌త్రిక నిర్వ‌హించిన స‌ర్వేలో భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు తేలింది.

అయితే దీని వెన‌క సీఎం చంద్ర‌బాబు హ‌స్తం ఉన్న‌ట్లు గంటా అనుమానిస్తున్న‌ట్లు స‌మాచారం. కావాల‌నే ప‌త్రిక స‌ర్వే పేరుతో అలా చెప్పిస్తున్నార‌ని గంటా అనుచ‌రులు, స‌న్నిహితులు కూడా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు చంద్ర‌బాబు కావాల‌నే స‌ర్వేలను ముందుకు తెస్తున్నార‌నీ గంటా శ్రీ‌నివాస‌రావు త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గ స‌మావేశానికి గంటా డుమ్మా కొట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఒక్క మంత్రి గంటానే కాదు.. ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తితోపాటు ప‌లువురు సీనియ‌ర్లు కూడా చంద్ర‌బాబు తీరుపై గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆర్థికంగా, సామాజికంగా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు బ‌ల‌మైన నేత కావ‌డంతో తిరుగుబావుటా ఎగుర‌వేసిన‌ట్లు ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. కొస‌మెరుపు ఏమిటంటే.. అవ‌స‌ర‌మైతే.. గంటాతోపాటు మంత్రి నారాయ‌ణ కూడా జ‌న‌సేనలో చేర‌వ‌చ్చున‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డం. మ‌రికొద్ది రోజుల్లోనే ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.