గ‌న్న‌వ‌రంలో వంశీకి కొత్త క‌ష్టం… ఊహించ‌ని ట్విస్ట్‌…!  

new problem to vamsi in gannavaram, Gannavaram, Vallabhaneni Vamshi, Dutta Ramchandra Rao, YSRCP, Chandrababu Naidu, TDP, Nara Lokesh, Ap - Telugu Ap, Chandrababu Naidu, Dutta Ramchandra Rao, Gannavaram, Nara Lokesh, Tdp, Vallabhaneni Vamshi, Ysrcp

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ సానుభూతిప‌రుడు అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.వంశీ వైసీపీ ఎంట్రీని స్థానిక నేత‌లు స్వాగ‌తించ‌డం లేదు.ఆయ‌నకు స్థానికంగా వైసీపీలోనే మ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌ల నుంచి సెగ స్టార్ట్ అయ్యింది.2014 ఎన్నిక‌ల్లో వంశీపై పోటీ చేసి ఓడిన దుట్టా రామ‌చంద్ర‌రావు, గ‌త ఎన్నికల్లో వంశీపై ఓడిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు ఇద్ద‌రూ వంశీ పేరు చెపితేనే మండి ప‌డుతున్నారు.

TeluguStop.com - Gannavaram Vallabhaneni Vamshi Dutta Ramchandra Rao

చివ‌ర‌కు జ‌గ‌న్ యార్ల‌గ‌డ్డ‌ను సంతృప్తి ప‌రిచేందుకు ఆయ‌న‌కు డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇచ్చారు.ఇక కొద్ది రోజుల క్రితం జ‌గ‌న్ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో యార్ల‌గ‌డ్డ‌, వంశీ చేయి క‌లిపి క‌లిసి ప‌ని చేయాల‌ని చెప్పినా కూడా ఈ వ‌ర్గాలు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌తో పాటు ఎమ్మెల్యేను కూడా తానే అని వంశీ త‌న‌కు తానే ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నారు.

TeluguStop.com - గ‌న్న‌వ‌రంలో వంశీకి కొత్త క‌ష్టం… ఊహించ‌ని ట్విస్ట్‌…-Political-Telugu Tollywood Photo Image

వంశీని అడ్డుకునేందుకు దుట్టా, యార్ల‌గ‌డ్డ అవ‌స‌రం అయితే టీడీపీతో అయినా చేతులు క‌ల‌పాల‌ని డిసైడ్ అయ్యార‌న్న ప్ర‌చారం కూడా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది.

టీడీపీ ఇప్ప‌టికే అక్క‌డ బీసీ వ‌ర్గానికి చెందిన బ‌చ్చుల అర్జ‌నుడికి నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే వంశీకి ఇప్ప‌టి నుంచే చెక్ పెట్ట‌డంతో పాటు భ‌విష్యత్తులో అత‌డు గ‌న్న‌వ‌రంలో మ‌ళ్లీ గెల‌వ‌కుండా ఉండేందుకు సొంత పార్టీలోనే మ‌రో రెండు బ‌ల‌మైన వ‌ర్గాలు టీడీపీకి ప‌రోక్షంగా స‌హ‌కారం అందించే ఆలోచ‌న‌లోనే ఉన్నాయ‌ట‌.

గ‌తంలో వంశీ త‌మ‌ను అనేక ఇబ్బందులు పెట్టార‌ని ఈ రెండు వ‌ర్గాలు గుస్సాతో ఉన్నాయి.ఇక వంశీని రెండు సార్లు గెలిపిస్తే పార్టీని వీడ‌డంతో పాటు చంద్ర‌బాబు, లోకేష్‌ను తీవ్రంగా తిట్ట‌డం టీడీపీ వ‌ర్గాలు త‌ట్టుకోలేక‌పోతున్నాయి.

ఏదేమైనా టీడీపీ, వైసీపీలోని వంశీ వ్య‌తిరేక వ‌ర్గాలు క‌ల‌వ‌డంతో గ‌న్న‌వ‌రంలో వంశీకి కొత్త క‌ష్టం వ‌చ్చిప‌డిన‌ట్టే… మ‌రి దీనిని ఆయ‌న ఎలా ఎదుర్కొంటారో ?  చూడాలి.

#DuttaRamchandra #Nara Lokesh #Gannavaram #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gannavaram Vallabhaneni Vamshi Dutta Ramchandra Rao Related Telugu News,Photos/Pics,Images..