గంగు భాయ్ ఓటిటి రిలీజ్ కి మొగ్గు చూపిస్తున్న బన్సాలీ

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా గంగూబాయి కతియావాడి.ఈ సినిమాని హిందీతో పాటు సౌత్ బాషలలో కూడా రిలీజ్ చేసేందుకు దర్శకుడు బన్సాలీ ప్లాన్ చేశారు.

 Gangubai Kathiawadi Plan To Ott Release, Tollywood, Bollywood, South Cinema, Ali-TeluguStop.com

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా నిజజీవిత కథ ఆధారంగా తెరపై ఆవిష్కరించారు.ఇక ఈ సినిమాలో గంగూభాయ్ పాత్రలో అలియా భట్ పరకాయ ప్రవేశం చేసి నటించంది చెప్పాలి.

ఇక ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.

అలియా భట్ కెరియర్ లో ఇదొక మరిచిపోలేని సినిమాగా మిగిలిపోతుందని అందరూ భావిస్తున్నారు.ఇక జులై 30న ప్రపంచ వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

అయితే అంతా బాగుంధనుకునే సమయంలో మరల కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ప్రతి రోజు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నాయి.

దీంతో ఇప్పటికే హిందీ సినిమా షూటింగ్ మెజారిటీ వరకు క్యాన్సిల్ అయిపోయాయి.

థియేటర్ లో బంద్ అయిపోయాయి.ఇక కొంత మంది రిలీజ్ లు వాయిదా వేసేసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ గంగూబాయ్ రిలీజ్ కి కూడా తగిలేల ఉంది.ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు బన్సాలీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ప్రముఖ ఒటీటీ నుంచి ఈ సినిమా కోసం భారీ ఆఫర్ వచ్చింది.అయితే దేశంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు చూస్తూ ఉంటే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

చేసిన ప్రేక్షకులు ధైర్యం చేసి సినిమా చూడటానికి రారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఒటీటీ రిలీజ్ కి వెళ్ళిపోవాలని సంజయ్ లీలా బన్సాలీ ఆలోచిస్తున్నట్లు బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube