మరో బాంబు పేల్చిన కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్... పంజాబ్ జైలు అధికారులపై ఆరోపణలు

పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తును ఆ రాష్ట్ర పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా ఈ హత్యకు సూత్రధారి , కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను భారత్‌కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ గత నెలలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 Gangster Goldy Brar Sensational Comments On Bathinda Jail Officials In Fb Post ,-TeluguStop.com

ఇదిలావుండగా గోల్డీ బ్రార్ మరో బాంబు పేల్చాడు.తన సన్నిహితులు బాబీ మల్హోత్రా, సరజ్ సంధు, జగ్రోషన్ హుండాల్‌ల తల్లిదండ్రులను భటిండా జైలు అధికారులు డబ్బులు అడిగారని సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

అంతేకాదు ఏ కారణం లేకుండా పోలీసులు తను కొట్టారని బ్రార్ ఆరోపించాడు.పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి హర్జిత్ బైన్స్‌ను ట్యాగ్ చేసి.

ఖైదీలను మరో జైలుకు తరలించాలని, ఇందర్‌జిత్ కహ్లోన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రార్ డిమాండ్ చేశాడు.అలాగే పోలీసులు వారిని మళ్లీ ఏదైనా పెద్ద నేరం చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నారని గోల్డీ బ్రార్ ఆరోపించాడు.

సందీప్ అంబియాన్ కేసులో తమకు న్యాయం జరిగి వుంటే పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య జరిగేది కాదన్నాడు.గోల్డీ బ్రార్ పోస్ట్‌పై జైళ్ల శాఖ మంత్రి స్పందిస్తూ.

గతంలో లాగా జైలులో అక్రమంగా సౌకర్యాలు పొందలేక గ్యాంగ్‌స్టర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించాడు.బెదిరింపులు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకుంటామని హర్జిత్ అన్నారు.

Telugu Bobby Malhotra, Fb, Gangster, Goldy Brar, Moose Wala, Punjab, Saraj Sandh

ఎవరీ గోల్డీ బ్రార్:

సిద్దూ హత్యతో గోల్డీ బ్రార్ పేరు మారు మోగిపోతోంది.అతను ఎవరు.ఏం చేసేవాడన్న దానిపై నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నాడు.ఇతని అసలు పేరు సతీందర్ సింగ్.పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్‌కి.

మరో గ్యాంగ్‌స్టర్ దవిందర్ బంభిహాకు మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.పంజాబ్ సహా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి.

గోల్డీ బ్రార్ సన్నిహితుడు మిద్దుఖేరాను బంభిహా గ్యాంగ్ గతేడాది హతమార్చింది.దీనికి ముందు బ్రార్ సమీప బంధువు గుర్లాల్ బ్రార్ కూడా హత్యకు గురయ్యాడు.

ఇతను బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ హత్యకు ప్రతీకారంగా కాంగ్రెస్ నేత గురులాల్ పహిల్వాన్‌ను లారెన్స్ గ్యాంగ్ హత్య చేసింది.ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న గోల్డీ బ్రార్ కెనడాకు పారిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube