అఫిషియల్ : ''గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'' రిలీజ్ డేట్ ఫిక్స్.. అనుకున్నదే జరిగింది!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టు కున్నాడు.

 Gangs Of Godavari Fixes New Release Date, Director Krishna Chaitanya , Vishw-TeluguStop.com

సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు.ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

విశ్వక్ సేన్ ”ధమ్కీ” సినిమా ( Dhamki Movie ) తర్వాత మరో సినిమాను రిలీజ్ చేయలేదు.ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులు విశ్వక్ లైన్లో పెట్టుకున్నాడు.విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’‘ ( Gangs Of Godavari )పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న విశ్వక్ ఆ తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయేలా అంచనాలు పెంచేసింది.

ఈ సినిమాలో విశ్వక్ ను మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ లుక్ లో చూడడంతో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.కృష్ణ చైతన్య ( Krishna Chaitanya ) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8నే రిలీజ్ అవ్వాల్సి ఉంది.

ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేసి అంచనాలు పెంచేసుకున్న ఈ సినిమా సడన్ గా వాయిదా పడింది.కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్.ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.దీంతో ఈ ఏడాదిలో ఈయన మరో సినిమా లేనట్టే అని చెప్పాలి.కాగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

చూడాలి విశ్వక్ సేన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube