ఫోటో షూట్ లతో కెరియర్ కి ప్లాన్ చేసుకుంటున్న గంగోత్రి బేబీ గర్ల్

సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ లు చేసిన వారు తరువాత పెద్ద స్టార్ హీరోయిన్స్ అయిన చరిత్ర ఇండస్ట్రీలో ఉంది.శ్రీదేవి నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ఉన్న అనూ ఇమ్మాన్యూయేల్ వరకు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ గా రాణించారు.

 Gangotri Baby Girl Kavya Plan To Introduce As A Heroine-TeluguStop.com

టీనేజ్ లోకి వచ్చిన తర్వాత 15 ఏళ్లకే వీళ్ళలో చాలా మంది హీరోయిన్స్ గా కెరియర్ స్టార్ట్ చేసేశారు.సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ లు రాణించిన కొంతమంది సీరియల్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ హీరోయిన్స్ రాణిస్తున్నారు.

అలాగే 10-15 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్స్ గా తెలుగు సినిమాలలో నటించిన అమ్మాయిలలో చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి అనే విషయం అందరికి తెలిసిందే.

 Gangotri Baby Girl Kavya Plan To Introduce As A Heroine-ఫోటో షూట్ లతో కెరియర్ కి ప్లాన్ చేసుకుంటున్న గంగోత్రి బేబీ గర్ల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో చిన్నప్పటి గంగోత్రి పాత్రలో కావ్య అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు అయ్యింది.

ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య ఇప్పుడు 22 ఏళ్ల వయస్సులో ఉంది.ఇక ఈ బ్యూటీ తన ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

దీనికోసం ఇప్పటికే మోడలింగ్ లో అడుగుపెట్టిన కావ్య యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకొని ఫోటోషూట్స్ కూడా మొదలు పెట్టింది.ఇక సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తన ఫోటోషూట్ ని అందరికి రీచ్ అయ్యేలా చేస్తుంది.

ఇప్పటికే ఈ బ్యూటీని పరిచయం చేయడానికి కొందరు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది.త్వరలో హీరోయిన్ గా ఆమె రీఎంట్రీ గ్రాండ్ గా ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

#Heroine #Allu Arjun #GangotriBaby

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు