బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన గంగవ్వ

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి మొదటి వారం నుంచి హాట్ ఫెవరెట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఉన్నారు.ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వలన ఫైనల్స్ వరకు ఆమెని ఎవరూ కూడా కదిలించలేరని అందరూ భావించారు.

 Gangavva To Quit The Bigg Boss Show, Tollywood, Reality Shows, Gangavva, Bigg Bo-TeluguStop.com

ఓ మూడు వారాల పాటు ఆమె కూడా ఇంట్లో సందడిగా ఉంటూనే వచ్చారు.అయితే గ్రామీణ వాతావరణంకి అలవాటు పడి ఆమె బిగ్ బాస్ హౌస్ లో నాలుగు గోడల మధ్య ఉండలేకపోయింది.

దాంతో తెలియకుండా అనారోగ్యానికి తరుచుగా గురవుతూ వచ్చింది.గత వారంలోనే అనారోగ్యంతో ఇంట్లో ఉండలేకపోతున్నా అని గంగవ్వ బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి చెప్పింది.

తరువాత ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించి, మెడిసన్ కూడా అందించారు.దీంతో మళ్ళీ నార్మల్ అయ్యింది.

అయితే ఈ వారంలో మళ్ళీ ఆమె ఇంట్లో అంతమందితో ఉన్నా కూడా ఏదో తెలియని ఒంటరితనంతో అనారోగ్యానికి గురైంది.దీంతో తాను ఇంట్లో ఉండలేకపోతున్నా అని కింగ్ నాగార్జునతో చెప్పేసింది.

తనని ఇంటి నుంచి పంపించేయాలని కోరింది.దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఆమెని ఇంటి నుంచి బయటకి రప్పించారు.

గంగ‌వ్వకు ఆరోగ్యం స‌రిగా లేద‌ని నాగ్ చెప్పుకొచ్చారు.అవ్వ‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి ర‌మ్మ‌ని చెప్పి సంభాషించారు.

గంగ‌వ్వ త‌న నాగ్ అన్న‌ను చూసి బోరున విల‌పించింది.ప‌దిరోజులుగా నిద్ర పోవడం లేదని, ఇల్లు లేద‌ని వ‌చ్చాను.

కానీ నా వ‌ల్ల కావడం లేదు ఆట కూడా ఆడ‌లేక‌పోతున్నా అని పేర్కొంది.న‌న్ను ఊరు పంపించేయండి.

నీకు మ‌నుమ‌రాలు పుట్టిన‌ప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చి మీ ఇల్లు చూస్తా అని చెప్పింది.ఆమె అవ‌స్థ‌కు క‌ల‌త చెందిన నాగార్జున అవ్వ ఈ హౌస్‌ను వీడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బిగ్‌బాస్‌కు విన్న‌వించారు.

దీంతో ఆమె వెళ్లిపోవ‌చ్చ‌ని బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు.ఆమె వెళ్లిపోయే ముందు గంగవ్వకి ఇల్లు కట్టిస్తా అని నాగార్జున కూడా స్టేజ్ మీద నేరుగా ఆమెకి హామీ ఇచ్చారు.

బిగ్ బాస్ సీజన్ వన్ లో సంపూర్ణేష్ బాబు అర్ధాంతరంగా హౌస్ వీడితే ఇప్పుడు గంగవ్వ కూడా అదే రీతిలో హౌస్ వీడడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube