సుమను అక్క అని పిలిచిన గంగవ్వ.. ఆమె ఏం చేసిందంటే..?

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా యాంకర్ గా సుమ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న మరో యాంకర్ లేరనే చెప్పవచ్చు.

 Gangavva Shocking Punches On Anchor Suma-TeluguStop.com

కొంతమంది యాంకర్లు గ్లామర్ షో చేస్తున్నా సుమకు ఆ యాంకర్లు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతున్నారు.సుమ తన టాలెంట్ తో గతంలో తక్కువ టీఆర్పీ రేటింగ్ లు వచ్చిన షోలకు కూడా ఎక్కువ మొత్తంలో టీఆర్పీ రేటింగ్ లు వచ్చేలా చేస్తున్నారు.

తాజాగా స్టార్ట్ మ్యూజిక్ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ షోకు గంగవ్వ హాజరయ్యారు.బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా పాపులారిటీని మరింత పెంచుకున్న గంగవ్వ స్టార్ట్ మ్యూజిక్ షోలో డ్యాన్స్ చేస్తూ కళ్లజోడు పెట్టుకున్నారు.సుమ మస్తు స్టైల్ కొడుతున్నావ్ గంగవ్వ అని చెప్పగా గంగవ్వ సుమక్క అని పిలిచి అవాకయ్యేలా చేశారు.60 సంవత్సరాల గంగవ్వ సుమక్క అని పిలవడంతో షాకవ్వడం సుమ వంతైంది.

 Gangavva Shocking Punches On Anchor Suma-సుమను అక్క అని పిలిచిన గంగవ్వ.. ఆమె ఏం చేసిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.ఏ షో చేసినా తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకర్షించడం సుమ ప్రత్యేకత అని చెప్పవచ్చు.కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో కూడా సుమ బిజీగా ఉండేవారు.కరోనా వైరస్ వల్ల గతంతో పోలిస్తే ఈవెంట్ల అవకాశాలు తగ్గినా ఇతర ఆఫర్లతో సుమ బిజీగా ఉండటం గమనార్హం.

సాధారణంగా సుమ షోలలో పాల్గొనే వాళ్లలో చాలామంది అక్కా అని పిలుస్తారు.

వాళ్లు సుమను అక్క అని పిలవడంలో ఆశ్చర్యం లేకపోయినా గంగవ్వ కూడా అలా పిలిచి ప్రేక్షకులను నవ్వించారు.ఎవరైనా తనపై పంచ్ వేస్తే రివర్స్ లో పంచ్ వేసే సుమ గంగవ్వ పంచ్ కు మాత్రం షాకై అలానే ఉండిపోవడం గమనార్హం.

#Music Promo #Reverse Punches #TV Show #Show #Anchor Suma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు