తనకు ఇల్లు కట్టి ఇవ్వకపోతే నాగ్ ఇంటికెళ్ళి నిలదీస్తా అంటున్న గంగవ్వ..!

ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 4 సీజన్ లో భాగంగా స్పెషల్ ఎంట్రీగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ పొందిన గంగవ్వ కు అవకాశం లభించింది.ఈ షో లో ఆవిడ బాగా రానిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆవిడ ఇంటి నుంచి బయటికి వెళ్లి పోయింది.

 Gangavva, Bigboss4, Nagarajuna, House, Bigg Boss Telugu S4, Gangavva, Rahul Sipl-TeluguStop.com

అనారోగ్యం సమస్యల కారణంగా ఆవిడ షో నుండి వైదొలగింది.ఇలా గంగవ్వ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక అనేక ఇంటర్వ్యూలలో ఆవిడ పాల్గొంది.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మండా గంగవ్వ ను ఇంటర్వ్యూ చేశాడు.ఇందులో భాగంగా గంగవ్వ మాట్లాడుతూ.

తాను చెట్లు, పుట్టలు, పొలాలు అంటూ తిరిగేదాన్ని బిగ్ బాస్ కు రావడానికి ముందు తనకు ఎలాంటి సమస్యలు లేవని వ్యాఖ్యలు చేసింది.దాంతో తాను చాలా ఉత్సాహంగా ఉండేదని కాకపోతే బిగ్ బాస్ కోసం వచ్చినప్పుడు తనని 21 రోజులు హోటల్ రూములో నాలుగు గోడల మధ్య ఉంచాలని అది తనకు నచ్చలేదని ఆవిడ తెలిపింది.

అయితే షో నిబంధనల ప్రకారం క్వారంటైన్ పేరుతో తనం ఒకే గదిలో కదలకుండా చేతులు కట్టేసినట్లు అయిందని ఆవిడ తెలిపింది.అంతేకాదు ఓ చిన్న గదిలో పెట్టడం ద్వారా తనకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడిందని దాంతో తన ఆరోగ్యం క్షీణించినట్లు గంగవ్వ తెలియజేసింది.

హోటల్లో మూడు వారాలపాటు క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత బిగ్ బాస్ వేదిక మీదకు వచ్చే సరికి నాలో సగం సహనం పోయిందని, అలాగే ఉత్సాహం కూడా తగ్గిపోయింది అని చెప్పింది.ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ వాతావరణం కూడా అతనికి పడలేదని హౌస్ లో ఎక్కువగా ఉండటంతో తన ఆరోగ్యం సహకరించలేదని ఆవిడ తెలిపింది.

కానీ ఇంతవరకు ఏసీ లలో ఎప్పుడు జీవించలేదని దాంతో తనకు రెండు సార్లు జ్వరం వచ్చిందని డాక్టర్లు వచ్చి వైద్యం అందించడంతో తాను ముందుకు సాగుతున్నట్టు తెలిపింది.

Telugu Bigboss, Gangavva, Nagarajuna-Latest News - Telugu

అయితే బిగ్ బాస్ షో కి 50 లక్షల డబ్బులు సాధించాలన్న పట్టుదలతో వచ్చానని గంగవ్వ తెలియచేసింది.అలాగే ఇంట్లోని సభ్యులందరూ తనని చాలా బాగా చూసుకున్నారని అఖిల్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.అలాగే మోనల్ అంటే తనకు ఇష్టం ఉండదని ఆవిడ నిమిషానికోసారి మూడ్ మార్చేస్తుందని తెలిపింది.

అలాగే వారిద్దరి మధ్య ప్రేమ అంటూ ఏమీ లేదని అంతా ఉత్తిదే అని తేల్చి చెప్పేసింది.అలాగే బిగ్బాస్ తనకి బాగా ఇచ్చాడని.వారానికి రెండు లక్షల చొప్పున మొత్తం ఐదు వారాల గాను 10 లక్షల రూపాయలు చెల్లించరని ఆవిడ తెలియజేసింది.దీంతో తాను తన ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

అయితే, దానికి పది లక్షలు సరిపోవని బిగ్బాస్ ఇల్లు కట్టిస్తా అని చెప్పాడని అంటుంది గంగవ్వ.నాకు ఇల్లు కట్టిస్తా అని నాగార్జున కూడా మాట ఇచ్చారని ఒకవేళ అది జరగకపోతే నాగార్జున సార్ ఇంటి దాకా వెళ్లి నిలదీస్తా అని సరదాగా నవ్వుతూ గంగవ్వ తెలిపింది.

అంతేకాదు నాగార్జున తనని ఇంటికి కూడా రమ్మన్నారని, తనకు ఇల్లు కట్టిస్తా అని చెప్పారు కాబట్టి అది నాకు అది ఆయన చేసి పెడతారని నమ్మకం ఉంది అంటుంది.కింగ్ నాగార్జున సహాయం చేస్తే అందులో కొంత ఉపయోగించి, కొంత దాచుకోవడానికి, అలాగే మరికొంత బంగారం కొనుగోలు చేస్తానని ఆవిడ తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube