బిగ్ బాస్ లో కెప్టెన్ బాధ్యతలు అందుకున్న గంగవ్వ...!

ఈ వారం మొత్తం ఉక్కు హృదయం టాస్క్ తో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తోంది.టాస్క్ లో భాగంగా జరిగిన సంఘటనలను పక్కన పెట్టి అందరూ ప్రస్తుతం హాయిగా గడిపేస్తున్నారు.

 Bigg Boss4 New Captain Gangavva,bb4, Gangavva, Captain, Lasya, Abhijeet, Harika,-TeluguStop.com

గత రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అందరూ నక్కిలేసు గొలుసు పాట కు సంబంధించి వారి స్టైల్స్ లో చిందులు వేసి మెప్పించారు.ఆ తర్వాత టాస్క్ గురించి ఇంట్లో కొద్ది సేపు చర్చలు జరిగాయి.

ఇలా జరుగుతున్న సమయంలో జైలులో ఉన్న నోయల్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.

ఇలా బిగ్ బాస్ జైల్ నుండి నోయల్ విడుదలయ్యే ముందు హౌస్ మేట్స్ అందరూ ప్రమాణం చేశారు.

అందులో ‘ బిగ్ బాస్ మై డ్రీమ్, ఆల్ ది కంటెస్టెంట్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ‘ అని పాడారు.అయితే ఈ సమయంలో అభిజిత్ మాత్రం పక్కన ఉంటూ అన్ని గమనిస్తూ ఉన్నాడు.

ఇక కొద్దిసేపు తర్వాత ఉక్కు హృదయం అనే టాస్క్ లో ఎవరెవరు ఎలా ప్రదర్శించారన్న హావభావాల అన్నిటిని గంగవ్వ ఒక్కటే పర్ఫామెన్స్ చేస్తూ హౌస్ మేట్స్ అందరిని ని తెగ నవ్వించేసింది.ఇక ఉక్కు హృదయం అనే టాస్క్ లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన నలుగురు అంటే అందులో హారిక, అభిజిత్, అవినాష్, గంగవ్వ లలో ఒకరికి కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని బిగ్ బాస్ తెలియజేశాడు.

ఇక ఇందులో బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ అయ్యే అవకాశం ఒకరికి ఉందని తెలియడంతో అందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు.రంగు పడుద్ది అనే టాస్క్ లో భాగంగా నలుగురికి రంగు నీళ్లతో నిండిన బౌల్స్ ఇవ్వగా చివరికి ఎవరు నీళ్లు కింద పడకుండా ఉంటే వారే విజేతలు బిగ్ బాస్ ప్రకటించాడు.

దీంతో హౌస్ లోని బిగ్ బాస్ సభ్యులందరూ గంగవ్వ కెప్టెన్ చేయాలనే క్రమంలో అభిజిత్, హారిక, అవినాష్ బౌల్స్ లో ఉన్న రంగు నీళ్లను పడేశారు.దీంతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఎన్నికయింది.

అయితే ఈ వారం లగ్జరీ బడ్జెట్ సంబంధించి పాయింట్స్ ను రద్దు చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.దీంతోపాటు రేషన్ లో కూడా కాస్త కోతలు విధించారు.

మరోసారి బిగ్ బాస్ రూల్స్ ను అతిక్రమిస్తే పనిష్మెంట్ మరింత తీవ్రంగా ఉంటుందని బిగ్ బాస్ హెచ్చరించాడు.బిగ్ బాస్ సభ్యులు ఇదొక్కసారి క్షమించమని అడిగిన కూడా బిగ్ బాస్ ఏ విధంగా కూడా కనికరించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube