బిబి : ఈవారం ఓటింగ్‌ మొత్తం తారుమారు

తెలుగు బిగ్‌బాస్‌ గత వారం ఎలిమినేషన్‌లో ఉన్న వారి కోసం ప్రేక్షకులు ఏకంగా అయిదు కోట్ల ఓట్లు కురిపించారు.అందులో ఎక్కువ శాతం గంగవ్వకు పడ్డట్లుగా ట్రేడ్‌ రిపోర్ట్‌.

 This Week Gangavva Voteing Total Change ,  Gangavva, Nagarjuna, Big Boss 4, Abhi-TeluguStop.com

ఆమెకు 40 నుండి 50 శాతం ఓట్లు పడ్డాయి అనడంలో సందేహం లేదు.కనుక గంగవ్వకు ఉన్న క్రేజ్‌ ఏపాటిదో ఇప్పటికే అందరికి అర్థం అయ్యింది.

రెండవ వారంలో కూడా గంగవ్వ ఎలిమినేషన్‌ లో ఉంది.ఎలిమినేషన్‌కు సంబంధించి గంగవ్వ చాలా ఈజీగా ఈ వారం కూడా సేవ్‌ అవుతుందని చాలా మంది నమ్మకంగా ఉన్నారు.

ఇదే సమయంలో ఆమెకు పోయిన వారం కంటే ఎక్కువ ఓట్లు పడుతాయని అనుకున్నారు.కాని పరిస్థితి చూస్తుంటే మొత్తం తారు మారు అవుతోంది.

ఈసారి గంగవ్వ కంటే ఎక్కువగా అభిజిత్‌కు ఓట్లు పడుతున్నాయి.అభిజిత్‌ మరియు అఖిల్‌ లు మోనాల్‌ తో కలుపుతున్న పులిహోర కారణంగా మంచి ఆధరణ అయితే తెచ్చకుంటున్నారు.

గంగవ్వకు ఖచ్చితంగా ఈ వారం కూడా మంచి ఓట్లు అయితే పడేవి.కాని మొన్నటి వీకెండ్‌ లో నాగార్జున వచ్చిన సమయంలో నేను ఉండలేక పోతున్నా.కొన్ని రోజుల తర్వాత పోతాను అంటూ చెప్పుకొచ్చింది.ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషయంలో ఆందోళన ఎక్కువ అయ్యింది.

అందుకే ఆమెను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచడం సరికాదని ప్రేక్షకులు భావిస్తున్నారట.అందుకే ఓట్లు వేయడం మానేశారు.

కొందరు గంగవ్వ ఎలిమినేషన్‌లో ఉంటే షో చూడకుండానే ఓట్లు వేస్తామని చెప్పారు.కాని ఇప్పుడు మాత్రం గంగవ్వకు ఓట్లు వేయకుండా ఆమెను సేవ్‌ చేయాలని భావిస్తున్నారు.

Telugu Abhijith, Akhil, Big Boss, Gangavva, Monal, Nagarjuna-Movie

గతంలో మధుప్రియ ఉండాలనుకోవడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె అంటే అభిమానం ఉన్నా కూడా ఆమెకు ఓట్లు వేయకుండా ఉన్నారు.దాంతో ఆమె ఎలిమినేట్‌ అయ్యింది.ఇప్పుడు గంగవ్వ పరిస్థితి కూడా అంతే అన్నట్లుగా ఉంది.గత రెండు మూడు రోజులుగా ఓటింగ్‌ మొత్తం తారు మారు అయ్యింది.అభిజిత్‌ మరియు ఇతర కంటెస్టెంట్స్‌ కు మంచి ఓట్లు వస్తున్నాయి.గంగవ్వ కు ఇప్పటికే భారీగా వచ్చాయి కనుక సేవ్‌ అవుతుంది.

అయినా ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube