ఆస్పత్రిలో బిగ్ బాస్ గంగవ్వ.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా గంగవ్వ భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ కొన్ని రోజులే ఉన్నా ఆమెకు లక్షల సంఖ్యలో అభిమానులు ఏర్పడటంతో పాటు ఒక దశలో గంగవ్వే బిగ్ బాస్ విన్నర్ అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది.

 Gangavva Bigg Boss House Photo Goes Viral In Social Media-TeluguStop.com

అయితే పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడిన గంగవ్వ ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకున్న గంగవ్వ ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

 Gangavva Bigg Boss House Photo Goes Viral In Social Media-ఆస్పత్రిలో బిగ్ బాస్ గంగవ్వ.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు 20 లక్షల రూపాయల ఖర్చుతో గంగవ్వ ఇంటి పనులు జరుగుతున్నాయి.అయితే తాజాగా గంగవ్వ ఆస్పత్రిలో చేరారు.గత కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్న గంగవ్వ ఆస్పత్రిలో చేరి మోకాళ్ల నొప్పులకు చికిత్స చేయించుకున్నారని తెలుస్తోంది.

గంగవ్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఆరు పదుల వయస్సులో కూడా గంగవ్వ అన్ని పనులు చేసుకోవడంతో పాటు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటున్నారు.బిగ్ బాస్ షో తర్వాత గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ కు సైతం సబ్ స్క్రైబర్ల సంఖ్య ఊహించిన దాని కంటే భారీగా పెరిగింది.

కొన్ని రోజుల క్రితం జరిగిన బిగ్ బాస్ ఉత్సవంలో కూడా గంగవ్వ పాల్గొనగా కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆమెకు బహుమతులను ఇచ్చారు.బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల గంగవ్వకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది.

పలు షోలలో, ఈవెంట్లలో కూడా పాల్గొంటున్న గంగవ్వ ఆ షోలలో తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

#Bigg Boss House #Social Media #Gangavva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు