నోయ‌ల్‌కు రెండో పెళ్లి.. ముహూర్తం పెట్టిన గంగ‌వ్వ?

ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్.గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Gangavva Asks To Noel Get Marry After Bigg Boss! Gangavva, Noel, Marriage, Lates-TeluguStop.com

ది షేక్ గ్రూప్ పేరుతో ఓ తెలుగు బ్యాండ్‌ను కూడా నోయ‌ల్ నిర్వ‌హిస్తున్నాడు.అయితే కేవ‌లం సింగ‌ర్‌గానే కాకుండా.

ఓ మంచి న‌టుడికిగా కూడా పేరు తెచ్చుకున్నాడు నోయ‌ల్‌.ఇక వెయ్యి అబద్ధాలు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించిన నోయ‌ల్ గ‌త ఏడాది జనవరి 3న పెళ్లి కూడా చేసుకున్నారు.

కానీ, వీరి బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు.

పెళ్లైన ఏడాదికే అంటే ఇటీవ‌ల నోయ‌ల్‌, ఎస్త‌ర్ విడాకులు తీసుకున్నారు.

మనస్పర్థల కార‌ణంగా విడాకులు తీసుకున్న‌ట్లు నోయ‌ల్ స్వ‌యంగా వెల్ల‌డించారు.అనంత‌రం బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఎంట్రీ ఇచ్చిన నోయ‌ల్‌.

త‌న ఎన‌ర్జీతో ఇంటి స‌భ్యుల‌ను ఫిదా చేయ‌డంతో పాటు ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తున్నారు.అయితే నోయ‌ల్‌ను ఏం అర్థం చేసుకుందో తెలియ‌దుగాని.

అత‌డిని రెండో పెళ్లి చేసుకోవాల‌ని గంగ‌వ్వ కోరింది‌.ప్ర‌స్తుతం బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ 4 ఐదో వారం పూర్తి చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ వారం నామినేష‌న్స్‌లో అఖిల్, అభిజిత్, నోయల్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు ఉన్నారు.వీరిలో ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న ఉత్కంఠ నెల‌కొన్న స‌మ‌యంలో.

అనూహ్యంగా నామినేష‌న్‌లో లేని గంగ‌వ్వ ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో నిన్న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.ఇక ఐదో వారం ఎలిమినేట్ అయిన గంగ‌వ్వ‌.బిగ్ బాస్ స్టేజ్ మీద‌కు వ‌చ్చి ఇంటి స‌భ్యుల గురించి చెబుతూ నాగార్జున‌తో కాసేపు సంద‌డి చేసింది.

ఈ క్ర‌మంలోనే నోయ‌ల్‌తో బిగ్ బాస్ టీవీ నుంచి మాట్లాడుతూ‌.

నువ్వు మంచోడివ‌ని.నువ్వు మ‌రో పెళ్లి చేసుకోవాల‌ని కోరింది గంగ‌వ్వ‌.

మా పల్లె వాళ్లు ఇక్కడకు రారు, లేదంటే నేనే సంబంధం చూసేదాన్ని అని చెప్పిన గంగ‌వ్వ.బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాల‌ని ముహూర్తం కూడా పెట్టింది.

మ‌రి నోయ‌ల్ బిగ్ బాస్ హౌస్‌ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక రెండో పెళ్లి చేసుకుంటాడో.లేదో.

చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube