సోషల్ మీడియా లో అప్పుడే మొదలైపోయిన గంగవ్వ ఆర్మీ రచ్చ రచ్చ...!

బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయింది.హోస్ట్ గా నాగార్జున కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ చేశారు.

 Bigg Boss Contestant Gangavva Hot Trending In Social Media, Youtube, Gangavva, B-TeluguStop.com

కంటెస్టెంట్లు స్టేజ్ పై డాన్సులు, వాళ్ల అనుభవాలను పంచుకున్నారు.సెప్టెంబర్ 6 ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఈ సారి హోస్ట్ గా నాగార్జున కొత్త లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.అప్పుడు స్టైలిష్ గా కనిపించిన నాగార్జున ఈ సారి ముసలోడి గెటప్ లో ఇరగదీశారు.

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న 16 మంది కంటెస్టెంట్లలో ఈ సారి గంగవ్వ కూడా పాల్గొన్నట్లు అందిరికి తెలిసిందే.మై విలేజ్ షో ద్వారా పాపులారిటీ సాధించుకున్న గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో దుమ్మురేపుతోంది.

తెలంగాణ యాసతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తోంది.

సమంత, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ తో ఇంటర్వ్యూ చేసి నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.

ఈ నేపథ్యంలో #Gangavva #BiggBoss Telugu4 హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తూ గంగవ్వ ఆర్మీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.షో స్టార్ అయిన తొలి రోజే ఆర్మీ స్టార్ట్ అవడం ఇదే ఫస్ట్.

మొదట్లో జరిగిన షోలల్లో కొద్ది రోజుల తర్వాత ఆర్మీలు పుట్టుకొచ్చాయి.కానీ, ఇప్పుడు గంగవ్వ కోసం తొలిరోజే ఆర్మీ పుట్టుకొచ్చింది.

బిగ్ బాస్ షోలో చివరి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వను శ్రీకాంత్ అనే యూట్యూబర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆమె కెమెరా ముందు కనబర్చిన ఎనర్జీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

పల్లెటూరి లైఫ్ పై తీసిన కామెడీ వీడియోలలో గంగవ్వ పాత్ర భిన్నమైంది.పదుల సంఖ్యలో జాతీయ మీడియా సంస్థలు గంగవ్వపై ప్రత్యేక కార్యక్రమాలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.

ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చింది.నెల రోజులుగా గంగవ్వ ఎంట్రీపై ప్రచారం జరిగినా ఆమె షోలో వస్తుందా లేదా అనే అనుమానాలు తలెత్తేవి.

కానీ ఆ అనుమానాలను పటాపంచెలు చేస్తూ భయం భయంగానే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube