అదానీ సొంతం కానున్న గంగవరం పోర్టు.. ఏపీ వాటా ఎంతంటే.. ?

కేంద్రం పలు సంస్దలను ప్రైవేటీకరణ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ దశలో ప్రైవేటీకరణను స్వాగతిస్తూ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం గంగవరం పోర్టు విషయంలో కూడా మరో అడుగు ముందుకేసింది.

 Gangavaram Port To Be Owned By Adani Group , Gangavaram Port, Owned By, Adani, A-TeluguStop.com

ఇందులో భాగంగా గంగవరం పోర్టు పూర్తిగా అదానీ చేతుల్లోకి వెళ్లిపోనుంది.కాగా సీసీఐ కూడా దీనికి నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.ఇకపోతే పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ తీసుకున్న 89.6 శాతం వాటాకు కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలుపగా, ఈ పోర్టులో ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం వాటా దక్కింది.

మిగిలిన 89.6 శాతం వాటా తీసుకునేందుకు ఇప్పుడు సీసీఐ నుంచి అదానీకి అనుమతి రావడంతో పోర్టు పూర్తిగా అదానీ చేతుల్లోకి వెళ్లిపోనుంది.ఇక అదానీ గ్రూపే ఆధ్వర్యంలోనే ఇక్కడి కార్యకలాపాలన్నీ జరగనున్నాయి.

ఇదిలా ఉండగా బీవోటీ విధానంలో 30 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుని గంగవరంలో పోర్టును అభివృద్ధి చేసిన రాజు పెద్ద మొత్తంలోని వాటాను ఇటీవల అదానీకి విక్రయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube