మొదటి రోజే రచ్చ.. నామినేషన్‌ లో గంగవ్వ

సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మొదలైన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మొన్న కంటెస్టెంట్స్‌ పరిచయం అవ్వగా నిన్నటి నుండి అసలు ఆట మొదలైంది.సాదారణంగా అయితే ఒకటి రెండు రోజుల తర్వాత గొడవలు లేదంటే వివాదాలు ఏడుపులు స్టార్ట్‌ అవ్వాలి.

 Telugu Bigg Boss, Monal Gajjar, Nominations, Gangavva Army, Social Media, Fans,-TeluguStop.com

కాని ఈ సీజన్‌లో మాత్రం మొదటి రోజు నుండే గొడవలు ఏడుపులు ప్రారంభం అయ్యాయి.షో షురూ అవ్వడమే ఆలస్యం గొడవలకు దిగడంతో ఈసారి షో రంజుగా సాగే అవకాశం ఉందని అప్పుడే ప్రేక్షకులు అంచనాలు పెట్టుకుని ఉన్నారు.

మొదటి ఎపిసోడ్‌ లో మోనాల్‌ గజ్జర్‌, సాయి కిరణ్‌, సుజాతలు ఎక్కువ సందడి చేశారు.వారు చేసిన హడావుడి మరియు ఇతరత్ర కారణాలతో నిన్నటి షో రక్తి కట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మోనాల్‌ గజ్జర్‌ మరీ చిన్న విషయాలకు విల విలమంటూ ఏడ్చేస్తోంది.ఆమె ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కావడం లేదు.ఆమెపై మీమ్స్‌ పిచ్చ పిచ్చగా వచ్చేస్తున్నాయి.గత సీజన్‌ లో జ్యోతక్క మాదిరిగా ఈ సీజన్‌ లో మోనాల్‌ ట్యాప్‌ ఓపెన్‌ చేస్తుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గంగవ్వ ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అనుకున్న ప్రేక్షకులకు బాగానే ఉంది అనిపించింది.మోనాల్‌ ఏడుస్తున్న సమయంలో అనూహ్యంగా గంగవ్వ ఏడవడంతో అంతా కూడా ఒక్క చోటుకు చేరారు.

అమ్మ నాన్న లేరు అంటూ వాళ్లు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందని గంగవ్వ చెప్పుకొచ్చింది.

Telugu Fans, Gangavva, Monal Gajjar, Nagarjuna-Movie

ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌ లో గంగవ్వ నిలవడం జరిగింది.మొత్తం ఎనిమిది గ్రూప్‌ లుగా చేసిన విషయం తెల్సిందే.ఆ ఎనిమిది గ్రూపుల్లో ఇద్దరు సీక్రెట్‌ రూంలో ఉన్నారు.

మిగిలిన ఏడు గ్రూపుల్లో ఒక్కరు ఒక్కరు చొప్పున నామినేషన్‌ అయ్యారు.గంగవ్వ మరియు నోయల్‌ లు ఉండగా ఇంటి సభ్యులు అంతా కూడా తీర్మానం చేసి గంగవ్వను నామినేషన్‌ లో ఉంచాలని నిర్ణయించారు.

గంగవ్వకు మంచి ఓట్లు పడుతాయి.ఖచ్చితంగా ఆమె సేవ్‌ అవుతుందని భావిస్తున్నట్లుగా చెప్పారు.

అయితే సోషల్‌ మీడియాలో గంగవ్వ అభిమానులు మాత్రం నామినేట్‌ చేసిన అందరిపై చాలా సీరియస్‌ గా మీమ్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube